Cardiac arrest symptoms : మన శరీరంలో అతి ముఖ్యమైనది గుండె. ఒక్కక్షణం అది పనిచేయడం ఆగిపోతే.. మనం ప్రాణాలు కోల్పోవాల్సిందే. కానీ ఈమధ్య ఈ మరణాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. చిన్న,పెద్ద వయసుతో సంభందం లేకుండా అందరి గుండెలు అర్దాంతరంగా ఆగి పోతున్నాయి. దీనిని “కార్డియాక్ అరెస్ట్ “అని అంటారు. ఇది అటాక్ అయితే ప్రాణాలు కోల్పోవాల్సిందేనా? దీనిని ముందుగా గుర్తించలేమా?
కాస్త జాగ్రత్తగా ఉంటే ముందుగానే ఈ కార్డియక్ అరెస్ట్ ను కనిపెట్టొచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, స్పృహ కోల్పోవడం లేదా పైన కొన్ని సంకేతాలు వంటి లక్షణాలను మీరు గమనించినట్లయితే మీరు వెంటనే మీ డాక్టర్తో మాట్లాడాలి. వెంటనే చికిత్స అందింతే.. అది కూడా కేవలం మూడు నిమిషాల్లో షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వగలిగితే మనిషి ప్రాణాలను కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు డాక్టర్లు.
ఈ కార్డియక్ అరెస్ట్ సాధారణంగా గుండెలో ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ వల్ల వస్తుంది. ఇది గుండె కొట్టుకునే విధానాన్నీ డిస్ట్రబ్ చేస్తుంది. ఇది గుండె యొక్క పంపింగ్ చర్యకు ఆటంకం కలిగిస్తుంది. శరీరంలో రక్త ప్రవాహాన్ని ఆపుతుంది. తక్షణ చికిత్స అందించకపోతే ఒక వ్యక్తి స్పృహ కోల్పోయి నిమిషాల వ్యవధిలో చనిపోవచ్చు.