Rose Day: ఫిబ్రవరి వచ్చిందంటే చాలు ప్రపంచాన్ని రొమాంటిక్ ఫీలింగ్స్ ఆవరిస్తాయి. ఈ నెలని లవర్స్ మంత్ అని అందుకే పిలుస్తారు. ఈ టైమ్ కోసం ప్రేమికులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. ఇక ఈరోజు నుంచి ప్రేమికుల వారోత్సవాలు మొదలు కానున్నాయి. ఏడు రోజుల పాటు జరిగే ఈ వాలెంటైన్స్ వీక్.. రోజ్ డేతో స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 14న లవర్స్‌డేతో ముగుస్తుంది.
రెడ్ రోజ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరేమో.. వాటి రంగు ఆ ఫీలింగ్ ను కలిగిస్తుంది. వాలంటైన్స్ డేలో రోజ్ డే కి చాలా ప్రత్యేకత ఉంది. ప్రేమకు చిహ్నం ఈ రోజ్. రోజా పూలు అనగానే ఎర్రగులాబీలే ఎక్కువగా ప్రేమికుల్ని ఆకర్షిస్తాయి. వీటిని తమకిష్టమైన వారిని ఇచ్చి తమ ప్రేమని తెలియజేస్తారు లవర్స్.
Also Read: మీ పార్ట్ నర్ తో సంతోషంగా లేరు అనడానికి సంకేతాలు ఇవే…!
ఇక రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ ప్రేమకు నిదర్శనంగా.. ఎల్లో కలర్ ఫ్లవర్ ఫ్రెండ్ షిప్‌కు గుర్తుగా ఉంటుందని లవర్స్ నమ్మకం. కాబట్టి మీరు లవ్ చేసే వ్యక్తికి ఏ కలర్ రోజ్ ఇవ్వాలో ముందే నిర్ణయించుకోండి.
ఇక రోజ్‌డే అంటే మనసులో మాటను సైలెంట్ మనకు నచ్చిన వాళ్లకి చెప్పే రోజు. నోటితో ఐ లవ్ యూ అని చెప్పకుండానే ఒక్క రోజ్‌తో లవర్‌కు ప్రపోజ్ చేసే రోజు. ఇష్టమైన ఎవరికైనా ఈ రోజున రెడ్ కాకుండా వేరే కలర్ గులాబీ ఇచ్చి అభిమానాన్ని వ్యక్తం చేయవచ్చు. రెడ్ ఇచ్చిన తప్పేం లేదు కానీ.. వాళ్లు తప్పుగా అర్ధం చేసుకునే ఛాన్స్ ఉంది.