White Cobra : “పాము” ఈ పేరు వినగానే వెన్నులో వణుకు పుడుతుంది. పాము అంటే భయపడని వారంటూ ఉండరు. ఈ ప్రకృతిలో చాలా రకాల పాములు జీవసిస్తున్నాయి. దాంట్లో ఒక రకమే శ్వేత నాగు. ఇది చాలా విషపూరితమైనది. చూడడానికి పూర్తిగా తెలుపు రంగులో ఉంటుంది.
అయితే చాలా సినిమాలలో పాములు పగ పడతాయని, ఒక వ్యక్తిని చూస్తే, ఆ వ్యక్తిని గుర్తు పెట్టుకొని పగ తీర్చుకుంటాయని చూపిస్తూ ఉంటారు. వాస్తవానికి పాములు నిజంగా పగ పడతాయా? పాములకు ఆ జ్ఞానం ఉందా? శాస్త్రీయంగా ఏమి నిరూపించబడింది.! ఇప్పుడు తెలుసుకుందాం.
సినిమాల్లో చూపించే లాగా నిజ జీవితాల్లో పాములు పగ పట్టవు. పగ పట్టిన వ్యక్తి కోసం ఊర్లు దాటి మరీ వెళ్లి పగ తీర్చుకోవు. అదంతా కేవలం సినిమాలాల్లో చూపించే కల్పితం మాత్రమే. పాములు పగ పట్టవు అని ,వాటికి ఆ విధమైన జ్ఞానం లేదు అనే విషయము శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. కేవలము పాము తనని తాను రక్షించుకోవడం కోసమే తన విషాన్ని ఉపయోగిస్తుందే తప్ప, ఇతరులను ముఖ్యంగా మనుషులను గుర్తు పెట్టుకొని వారిని వెతుక్కుంటూ వెళ్లి పగ తీర్చుకోదు.