Chocolate Day Valentine Week : వాలెంటైన్స్ వీక్.. సాధారణంగా ప్రేమికులకు సంవత్సరమంతా స్పెషల్.. కానీ ఈ వాలెంటైన్స్ వీక్ మాత్రం అతి మధుర జ్ఞాపకాలను అందిస్తుంది. ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకమైన రోజుతో తమ మనసులో ఉన్నవారికి తమ ప్రేమను తెలియజేసే అవకాశం ఉంటుంది. వాలెంటైన్ వీక్లో మూడవ రోజు (ఫిబ్రవరి 9) చాక్లెట్ డే. ఈ స్వీటేస్ట్ డే కోసం జంటలు ఎదురు చూస్తుంటాయి.
మనసులోని భావాలను వ్యక్తపరిచేందుకు సరైన మార్గం.. ఈ చాక్లెట్స్ అని చెప్పుకోవచ్చు. చాక్లెట్స్ కేవలం సంతోషానికి ప్రతీక మాత్రమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ముఖ్యంగా డార్క్ చాక్లెట్స్ మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అవేంటో తెలుసుకుందాం..
◆ హెల్త్ లైన్ డార్క్ చాక్లెట్స్ వార్తల ప్రకారం.. చాక్లెట్స్ రక్తంలో చక్కెర స్థాయిని, గుండె జబ్బుల వంటి వ్యాధులను తగ్గిస్తుంది. అంతేకాకుండా.. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. డార్క్ చాక్లెట్స్ తినడం వలన ఒత్తిడి తగ్గి.. మనసుకు ప్రశాంతత కలుగుతుంది.
◆ డార్క్ చాక్లెట్ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. అలాగే మధుమేహం వంటి వ్యాధులను నియంత్రిస్తుంది.
◆ డార్క్ చాక్లెట్ కార్డియోప్రొటెక్టివ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా.. హృదయ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది.
◆ డార్క్ చాక్లెట్స్ వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తుంది. వయసు పెరిగే కొద్ది ఏర్పడే చర్మ సమస్యలను తగ్గించడంలో ఇది పనిచేస్తుంది. యాంటీ ఏజింగ్ ఏజెంట్ మాదిరిగా పనిచేస్తుంది.
Also Read: మోక్షజ్ఞ హీరో అవుతాడు కానీ ఆ పని మాత్రం చేయలేడు అంటూ వేణు స్వామి హాట్ కామెంట్స్..!
◆ ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించడంలో డార్క్ చాక్లెట్స్ ఉపయోగపడతాయి. దీంతో తలనొప్పి, అలసట, ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతత కలుగుతుంది.
◆ అధిక రక్తపోటు.. (బీపీ) సమస్యతో ఇబ్బందిపడుతున్న వారికి డార్క్ చాక్లెట్స్ మేలు చేస్తాయి. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.