Women of Spain : ఒకప్పటి కాలంలో మహిళలు బయటకు రావాలంటే ఎన్నో నియమ,నిబంధనలు ఉండేవి. వారు ఇంటి గడప దాటి బయట కాలు పెట్టాలంటే చాలా ఆంక్షలు విధించేవారు. పెళ్లయిన మహిళలకు అయితే ఇంకా ఈ ఆంక్షలు రెట్టింపుగా ఉండేవి. మహిళలు చదువుకోవాలన్నా కూడా వారికి సౌకర్యం ఉండకపోయేది. కేవలం నాలుగు గోడలకే పరిమితం అన్నట్టుగా వాళ్ళు జీవిస్తూ ఉండేవారు.
కానీ రాను రాను సమాజంలో మార్పు మొదలైన తర్వాత ఇప్పుడు పురుషులతో పాటు మహిళలు కూడా సమాన స్థాయిని చేరుకోగలుగుతున్నారు. చదువులో, ఉద్యోగాల్లో ముందడుగులో ఉన్నారు. అయితే ఎంత ఉద్యోగం చేసి, విమానాలు నడిపే స్థాయికి ఎదిగినా కూడా మహిళలకు ఇంటి పని భారం మాత్రం తగ్గట్లేదు. ఉద్యోగాలు చేసేవారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది.
మగవారికి ఒక ఉద్యోగంతోనే ఆరోజు పని ముగిసిపోతుంది. కానీ మహిళల పరిస్థితి అలా కాదు. వారు ఒకవైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు ఇంటి పని చేస్తూ అధిక శ్రమను అనుభవిస్తున్నారు. ఏ ప్రాంతం,దేశం అని కాకుండా ఎక్కడ చూసినా మహిళలు ఇంటి పనితో సతమతమవుతున్నారు. ఇంటి పనికి వారు ఎటువంటి జీతం తీసుకోకుండా జాబ్ చేస్తున్నారు. వీటిని డబ్బుల్లో కనుక లెక్క కడితే ప్రపంచ వ్యాప్తంగా ఒక లక్ష డెబ్భై వేల డాలర్లు చెల్లించాల్సి వస్తుందట.
మహిళలకు పని భారం ఎక్కువ కావడంతో వారు శారీరకంగా అలిసిపోయి,ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. మహిళ గురించి ఆలోచించిన స్పెయిన్ ప్రభుత్వం ఇంటి దగ్గర చాకిరీ చేసే మహిళల కోసం ఒక ప్రత్యేకమైన యాప్ ని తీసుకొచ్చింది. ఆ యాప్ ద్వారా ఇంటిలో ఉండే మగవారు, ఆడవాళ్లు ఎంత, ఎంత పని చేస్తున్నారో రిజిస్టర్ చేయాలి అని ఒక కండిషన్ పెట్టింది.
అలా రిజిస్టర్ చేసిన దానిని అక్కడ ప్రభుత్వం మానిటర్ చేస్తుంది. ఇంటి పని, వంట పని, ఆఫీస్ పని అని మహిళలకు వర్క్ ఎక్కువ అవ్వడంతో, ఇంటి దగ్గర పనిలో మగవాళ్ళు కూడా భాగం కావాలనే చట్టాన్ని తీసుకువచ్చింది ప్రభుత్వం. ఒక్క స్పెయిన్ ప్రభుత్వమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ విధానాన్ని అమలు చేసి ఇంటి పని భారం నుండి మహిళలకు విముక్తి కల్పిస్తే బాగుంటుంది.