YCP vs Janasena : మాకు నమ్మకం లేదు దొరా – వైసీపీ కి జనసేన స్ట్రాంగ్ కౌంటర్..
ఏపీలో మరొకసారి అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్సిపి చేస్తున్న మరో కార్యక్రమం “మా నమ్మకం నువ్వే జగన్..” రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పొందిన ప్రతి ఇంటికి ఈ స్టిక్కర్ ని అంటించాలని వైఎస్ఆర్సిపి సన్నాహాలు చేస్తుంది. ఈరోజు నుంచే ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆల్రెడీ శ్రేణులకు పార్టీ అధిష్టానం నిర్దేశాలను జారీ చేసింది.
అయితే వైసీపీ కార్యక్రమం మొదలు కాక ముందే జనసేన దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.. “మాకు నమ్మకం లేదు దొరా..” అంటూ ప్రచారానికి తెరలేపింది. సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులను బెదిరించి ఓట్లు వేయించుకోవడానికి ప్రభుత్వ డబ్బులతో వైసీపీ ప్రచారం చేసుకుంటుందని ఆరోపిస్తోంది జనసేన. అంతేకాకుండా “మాకు నమ్మకం లేదు దొరా..” అనే ట్యాగ్‌లైన్‌తో పాటు నువ్ మా దరిద్రం జగన్ అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తుంది.
అయినా మా నమ్మకం నువ్వే జగన్ అంటూ జనం తమ నమ్మకాన్ని జగన్ కి చెప్తే బాగుంటుంది గాని ఇలా జగన్ ప్రభుత్వమే స్టిక్కర్లు ప్రింట్ చేయించి.. అవి తీసుకు వెళ్లి జనాల ఇళ్లకు అంటించి తమకు తాము చప్పట్లు కొట్టుకోవడం మాత్రం చూడడానికి చాలా కామెడీ గానూ.. చీప్ గానూ ఉంది .. ఇది జనం జగన్ ని పొగడ్డం లేదని జగనే తనను తానే పొగుడుకున్నట్టు ఉందని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
Also Read : హరి హర వీరమల్లు ఫస్ట్ సాంగ్ ఎప్పుడంటే..
ఏది ఏమైనా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే జగన్లో ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఏ రేంజ్ లో ఉందో ఈ కార్యక్రమం సూచిస్తుంది. గడపగడపకూ అంటూ కార్యక్రమాలను మొదలుపెట్టిన వైసిపి ప్రభుత్వం అది ఫెయిల్ అవ్వడంతో “జగన్ కి చెబుదాం..” అని ఓ కార్యక్రమం.. “మా నమ్మకం నువ్వే జగన్..” అంటూ ఇపుడు ఇంకో కార్యక్రమానికి తెరతీసి గందరగోళ పరిస్థితుల్లో కనిపిస్తుంది. అసలు అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి రాష్ట్ర అభివృద్ధి గురించి కాక వైసిపి అధికారం గురించి మాత్రమే జగన్ ఆలోచనలు ఉన్నాయి. అందినకాడికి అప్పులు చేయడం.. జనానికి పంచడం.. ఇదే అభివృద్ధి అనే స్థాయిలో జగన్ ఆలోచనలు ఉన్నాయి పాలన గాలికి వదిలి పంచడంపైనే దృష్టి పెట్టింది వైసిపి ప్రభుత్వం.
ప్రజలకు డబ్బులు ఇస్తే చాలు ఇంకేం అవసరం లేదు అనుకునే నాయకుడు దేశంలో జగన్ ఒక్కడే నేమో అనిపిస్తుంది. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. రాష్ట్రాన్ని ఇంత దయనీయస్థితికి దిగజార్చినందుకు జనం మా నమ్మకం నువ్వే జగన్ అని చప్పట్లు కొడతారా..? కొట్టరు కదా..? అందుకే వైసిపి ప్రభుత్వం ఇలా తమకు తామే చప్పట్లు కొట్టుకుంటుంది..అనేది జనం మాట..