YouTuber : కష్టేఫలి అన్నారు పెద్దలు. అదేవిధంగా అదృష్టం ఎవరికైనా ఒకేసారి తలుపు తడుతుంది. కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి జీవితంలో మంచి స్థాయిలో ఉంటారు అని చెప్తూ ఉంటారు. అదృష్టంతో పాటు ఆలోచన విధానం, సృజనాత్మకత ఉంటే జీవితంలో నిలదొక్కుకోవడానికి ఎన్నో మార్గాలు మనకు ఎదురొస్తాయి. వీటన్నింటిని నిజం చేస్తూ ఒక పదహారేళ్ల కుర్రాడు కోటేశ్వరుడై ప్రపంచం ముందు తన విజయపతాకాన్ని ఎగురవేసాడు.
ఆ కుర్రాడు ఎక్కడివాడు.. అతను అందుకున్న విజయం ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ 16 సంవత్సరాల కుర్రాడి పేరు డోనాల్డ్ డోఫర్. ఇతడు అమెరికాకు చెందిన వ్యక్తి. ఇతడి నెల ఆదాయం వింటే మీరందరూ నోర్లు వెళ్లబెట్టాల్సిందే. నెలకు ఇతను సంపాదించేది అక్షరాల 20 వేల డాలర్లు. అంటే మన ఇండియా కరెన్సీలో దాదాపు 16 లక్షలు. ఈ అబ్బాయి డబ్బు, సూపర్ కార్స్, అత్యంత ఖరీదైన ఇళ్లను కొంటూ తనకంటూ ఒక స్టార్ డమ్ ఏర్పాటు చేసుకొని అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేస్తున్నాడు.

ఇతడికి ఇంత డబ్బు రావడానికి కారణం ఏంటి.. ఇతడు ధనవంతుడుగా ఎదగడానికి వెనుక ఉన్న విషయాలు ఏంటి అనేది తెలుసుకుందాం. డోనాల్డ్ 2019లో ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలు పెట్టాడు. అందులో ట్రావెల్ చేస్తున్న వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉండేవాడు. అలా క్రమక్రమంగా తన వీడియోలకు వ్యూస్ పెరగడం మొదలైంది. అలా అని తను చదువును నిర్లక్ష్యం చేయలేదు.
ఒకవైపు చదువుని కొనసాగిస్తూనే, ఖాళీ సమయంలో తను యూట్యూబ్లో ఎలాంటి వీడియోలను పోస్ట్ చేయాలి, కంటెంట్ ఎలా ఉండాలి అనే దాని పైన దృష్టి సారించేవాడు. యూట్యూబ్లో డోనాల్డ్ పోస్ట్ చేసిన వీడియోలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించడంతో తను యూట్యూబ్ స్టార్ గా ఎదిగిపోయాడు. తను మనం చెప్పుకున్నట్టుగా నెలకు లక్షల్లో సంపాదిస్తూ చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.

డోనాల్డ్ ప్రస్తుతం తల్లి, తండ్రి, సోదరితో కలిసి లాస్ ఏంజిల్స్ లో నివాసం ఉంటున్నాడు. తన యూట్యూబ్ ఛానల్ లో వారానికి ఒకటి లేదా రెండు వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటాడు. డోనాల్డ్ పోస్ట్ చేసే ఒక్కో వీడియోకి ఆరు లక్షల రూపాయలను సంపాదిస్తూ ఉంటాడు. డోనాల్డ్ తండ్రి డెవలపర్ గా పనిచేస్తున్నారు. మొత్తం కుటుంబం ఆస్తులు విలువ 500 మిలియన్ డాలర్లుగా ఉంది అని చెప్తున్నారు.
వీరి కుటుంబానికి శాండియాగాలో రెండు, లాస్ ఏంజిల్స్ లో రెండు, న్యూయార్క్ లో రెండు బహమస్ లో ఒక ఇల్లు ఉన్నాయి. పైగా ఈ కుర్రాడు కోటీశ్వరులు కావడం వల్ల చాలా నష్టాలు కూడా ఉంటాయని నవ్వుతూ చెబుతున్నాడు. తను ఒక పేదవాడిగా కూడా జీవించగలనని డోనాల్డ్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఒక మనిషి తను ఎదగాలి అని అంటే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే అది సఫలం అవుతుంది అని డోనాల్డ్ అంటాడు. కష్టపడంది ఏ విజయం దరికి చేరదని డోనాల్డ్ అభిప్రాయం.
