YS Jagan : హీరో టూ జీరో.. సర్వే రిపోర్ట్ ఇదే..!!
అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉందన్న సామెతలా అయింది ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ రెడ్డి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లాంటి అన్ని వనరులూ ఉన్న రాష్ట్రానికి పెద్ద అయి ఉండి.. సామాజికంగా, ఆర్థికంగా బలమైన వర్గానికి ప్రతినిధి అయినపట్టికీ ఆ స్థాయిని పదిలపరుచుకునే విషయంలో మాత్రం వై యస్ జగన్ మొదటి నుంచి తప్పటడుగులు వేస్తూనే వస్తున్నారు.
గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ప్రతి పక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతి విషయంలో విరుచుకు పడిన జగన్ రెడ్డి ఇప్పుడు తాను లేవనెత్తిన అంశాలపై తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత విమర్శలు ఎదుర్కోవడం ఆశ్చర్యం కలిగించే అంశం.
ప్రత్యేక హోదా మొదలుకుని రాష్ట్రానికి సంభండంచిన అతి ముఖ్యమైన ప్రతి విషయంలోనూ జగన్ అట్టర్ ఫ్లాప్ అవ్వడంమే కాక కేంద్రంలోనూ, రాష్ట్రంలోను భారీ మెజారిటీ ఉన్న పార్టీ అధినేతగా ఉంటూ అన్నిటికీ గత ప్రభుత్వాన్నే కారణ భూతంగా చూపిస్తూ ప్రజల ముందు తన డొల్ల తనాన్ని పదే పదే బయట పెట్టుకుంటున్నారు.
కేవలం తన వర్గాన్నో..తన అభిమతాన్ని పాటించే వర్గ ప్రజలనో పదవులు, పథకాల రూపంలో సంతృప్తి పరుస్తూ ఎన్నికల్లో తన బలం, బలగంతో “ఎలాగైనా” గెలవచ్చు అన్న ఉద్దేశంతో ప్రజలకి అవసరమైన అసలైన అభివృద్ధిని, అవసరాలను పక్కన పెట్టిన వై ఎస్ జగన్ ప్రభుత్వం నేడు సొంత వర్గం ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుంది.
175/175 రాగం పాడుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలలోకి మాత్రం ధైర్యంగా రాలేకపోతుంది.తమ సభలకు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చేలా ఆకర్షించలేకపోతుంది అన్నది విశ్లేషకుల అభిప్రాయం.
అదే విషయం ఇటీవల వెల్లడైన నేష్ణల్ సర్వేలో తేట తెల్లం అయింది. ప్రముఖ జాతీయ సంస్థ నిర్వహించిన సర్వేలో దేశంలోని ముఖ్య మంత్రుల పనితీరు పట్టికలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ 39% ప్రజామోదంతో 10 వ స్థానంలో నిలిచారు.
AlsoRead : ఇలా చేస్తే వారాహిని ఆపడం ఈజీనే..
100 మందిని కొట్టు 10 మందికి పెట్టు సూత్రాన్ని నమ్ముకుని ప్రభుత్వాన్ని అప్పుల బండిలో నడుడుపుతున్న వై యస్ జగన్ పనితీరులో తన డొల్లతనానికి, మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహార శైలి పట్ల ప్రజా వ్యతిరేకతకి ఈ సర్వేనే నిదర్శనం అని రాజకీయ పండితులు అభిప్రాయ పడుతున్నారు.