చట్టాలు డబ్బున్నవాళ్ళు చుట్టాలు అనేది నానుడి. డబ్బుంటే తిమ్మిని బమ్మిని చేయగల లాయర్లు, ఆధారాలు తప్పితే ఆవేదనకు చోటులేని న్యాయస్థానాలు, అన్యాయం అంటూ గొంతు చించుకొని అరిచినా పట్టించుకోని సమాజం మద్యలో బ్రతుకుతున్నాం.
ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. తాజాగా కృష్ణాజిల్లాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఆయన రెండవ భార్య లక్ష్మీ పార్వతి చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
2004 జూన్ 3వ తేదీ రాత్రి జూబ్లీహిల్స్ బాలకృష్ణ నివాసంలో జరిగిన కాల్పుల సంఘటన అందరికీ తెలిసిందే. ఆరోజు బాలకృష్ణ సన్నిహిత మిత్రుడు నిర్మాత బెల్లంకొండ సురేష్ మరియు జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరి పై బాలయ్య కాల్పులు జరిపారు. తదనంతర పరిణామాలు ఎంతో వేగంగా జరిగాయి. ముందు హత్యాయత్నం కేసు నమోదు చేసారు పోలీసులు.
తర్వాత కోర్టులో కేసులు నిలవలేదు. బాలకృష్ణకు మతిస్థిమితం లేదనే సర్టిఫికెట్, మరియు బాధితులు నోరు విప్పకపోవడం వలన ఆ కేసు మూతపడింది.
ఇప్పుడు లక్ష్మీపార్వతి తెర వెనుక జరిగిన విషయాలను ప్రస్తావిస్తూ పబ్లిక్లో నిజాలను బయటపెట్టారు. ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల ముందే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ను రక్షించమని కంటనీరు పెట్టుకున్న తర్వాత ఆయన నీ కొడుక్కి ఏమీ కాదని భరోసా ఇచ్చి పంపారని, అదే సమయంలో వైయస్ జగన్ అండగా నిలిచారని వాస్తవాలను బహిర్గత పరిచారు.
లక్ష్మీ పార్వతి ఈ మాటలు విన్న ఎవరికైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైయస్ రాజశేఖర్రెడ్డి అండతోనే ఈ కేసు మూత పడిందనే విషయం అర్థమవుతుంది.
ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఏమిటంటే నాయకులు అధికారంలో ఉన్నా లేకపోయినా తాము చేసిన తప్పులను అండగా నిలిచే మీడియా, మరియు పలుకుబడి ఉన్నంతవరకు తప్పు చేసిన వాళ్ళు తప్పించుకుని తిరుగుతూనే ఉంటారు.
వాళ్లు అధికారంలో ఉంటే వీళ్లను కాపాడుతారు, వీళ్ళు అధికారంలో ఉంటే వాళ్లను కాపాడుతారు, మొత్తానికి తప్పు చేసినవాడికి శిక్ష మాత్రం పడకుండా చేస్తారు అనేది స్పషమైంది. బయటకు బద్ద శత్రువులు, లోలోపల మాత్రం నాయకులు అందరు మిత్రులే..