YSRCP Social Media : జగన్ రెడ్డి సోషల్ మీడియాకు కామన్ సెన్స్ లేదా..?
రాజకీయ పార్టీలు తమ పార్టీ ప్రచారానికి, ప్రత్యర్ధులపై విమర్శల బాణాలు సంధించడానికి సోషల్ మీడియాని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాయి. వాటి కోసం కోట్లలో ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడవు.
కొన్ని పార్టీలు తమ పార్టీ ప్రచారం కోసం కంటే కూడా ప్రత్యర్థి పార్టీల మీద బురద చల్లడమే ప్రధాన ఎజెండాగా సోషల్ మీడియా వేదికను ఉపయోగిస్తూ ఉంటాయి.. అటువంటి పార్టీల్లో ఏపి అధికార పార్టీ అయిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి వరుసలో ఉంటుంది.
ప్రత్యర్ధులపై విమర్శలు చేయడంలో విధానాల మీద కంటే వ్యక్తిగత అంశాల మీదే ఎక్కువ దృష్టి పెడుతారు అని వైసిపికి పేరు. ప్రత్యర్థులు చేసే ప్రతి పనిలో కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్టు వంకలు వెతకడం బురద చల్లడానికె అన్నట్టు గుడ్డిగా ఏదో ఒక విమర్శ చేయడం వీళ్లకి అలవాటు. చాలాసార్లు పరిధి దాటి అసభ్యకరమైన పదజాలం వాడుతూ మార్ఫింగ్ల వరకు వెళ్ళడం వీళ్ళ నైజం.
Also Read : ఇలా చేస్తే వారాహిని ఆపడం ఈజీనే..!!
కాకపోతే ఒక్కోసారి అనాలోచితంగా చేసిన విమర్శలు తిరిగి తిరిగి వాళ్ళ మెడకె చుట్టుకుని అంతిమంగా జగన్ రెడ్డికి చేటు తెస్తున్నాయి. కోట్లు ఖర్చు పెట్టి నియమించుకున్న తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త వల్లే తమ పార్టీకి నష్టం జరగడంతో అధికార పార్టీ పరిస్థితి ఒక్కోసారి అడకత్తెరలో పోక చెక్కలా అవుతుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పార్టీ ఆఫీస్లో చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బృందం పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకుని జెండా ఆవిష్కరణ చేసి జాతీయ జెండాను అవమానించారు అని ఒక గుడ్డి విమర్శ చేసింది.
దొరికిందే తడవుగా విజృంభించిన జనసేన శ్రేణులు జెండా వందనం చేసేటప్పుడు చెప్పులు వేసుకోకుండ చేయాలన్న చట్ట పరమైన నిబంధన ఏమీ లేదని..ప్రధాన మంత్రి కూడా జెండా ఆవిష్కరణ సమయంలో పాద రక్షలతోనే ఉన్నారని దమ్ము ధైర్యం ఉంటే ప్రధాని పై ఇవే విమర్శలు చేయమని సవాల్ విసురుతున్నారు.
తప్పులు ఎంచే ముందు చట్టాలను చదువుకోవాలి అని..అయినా జాతీయ జెండాపై పార్టీ రంగులు వేసి కోర్టులో మొట్టికాయలు తిన్న వాళ్ళకి,కనీసం జాతీయ గీతం పాడటానికి నోరు కూడా తిరగని నాయకులు ఉన్న పార్టీకి పవన్ కళ్యాణ్ గారి దేశ భక్తిని ప్రశ్నించే అర్హత లేదని మాటకి మాట జవాబు ఇస్తున్నారు. అంతటితో ఆగకుండా జగన్ రెడ్డి చెప్పులతో జెండా వందనం చేసిన ఫోటోలను చూపిస్తూ మీ అధినేతకు కూడా మీరు తిట్టే తిట్లు వర్తిస్తాయా అని నిలదీస్తున్నారు.. జగన్ రెడ్డి సోషల్ మీడియా కార్యకర్తలను నియమించేముందు తన పార్టీనా..లేక తన కులమా అని కాకుండా కామన్ సెన్స్ ఉందా లేదా అని చూసుకోవాలి అని సెటైర్లు వేస్తున్నారు.
ఏది ఏమైనా ప్రత్యర్థులపై బురద చల్లడమే ఎజెండాగా పెట్టుకునీ విమర్శలలో ఇసుమంత కూడా విచక్షణ చూపని వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా వల్ల జగన్ రెడ్డి మరోసారి అడ్డంగా దొరికిపోయాడు..
– ప్రద్యుమ్న