• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Special Stories

YSRCP Suspends 4 MLAs : సస్పెన్షన్ ప్లాన్..!! అసమ్మతిని చల్లార్చగలదా ఫ్యాన్..?

Sandhya by Sandhya
March 28, 2023
in Special Stories
245 8
0
YSRCP Suspeds 4 MLAs
495
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

YSRCP Suspends 4 MLAs : సస్పెన్షన్ ప్లాన్..!! అసమ్మతిని చల్లార్చగలదా ఫ్యాన్..?

• సిట్టింగ్ శాసనసభ్యుల అసమ్మతి రాగం
• ఒక్కో జిల్లా నుంచి బయటపడుతున్న విభేదాలు

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి సిట్టింగ్ శాసనసభ్యుల ద్వారా అసమ్మతి పెరగటంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది వైసీపీలో నేతల మధ్య నెలకొని ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది ముఖ్య నేతలతో పాటు సిట్టింగ్ శాసనసభ్యులు తమ వాదనను బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు, కృష్ణా మైలవరం, , కర్నూలు జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.. కృష్ణా జిల్లాలో వైసీపీ పట్ల అం తా విధేయులుగా ఉన్నా రని అనుకుం టున్న దశలో మైలవరంఎమ్మె ల్యే వసంత కృష్ణ ప్రసాద్ అసమ్మతి గళం వినిపిం చడం మొదలుపెట్టారు.

వైసీపీలో ఏం జరుగుతోంది? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిపై పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? అధినాయకత్వం ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎమ్మెల్యేలు ఏం ఆలోచిస్తున్నారు? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే నెపంతో ఏకపక్షంగా నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, పార్టీ క్యాడర్ ఎలా చూస్తున్నారు? మరీ ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్ గురించి ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఈ ప్రశ్నలన్నిటికీ సామాన్య ప్రజల నుంచి మేథావుల వరకు అందరూ అందరి నోటా వ్యక్తమౌతున్న ఎకాభిప్రాయం వైసీపి ప్రతిష్ట మసక బారుతోందని. పట్టభద్రుల నియోజక వర్గాల్లో వైకాపా ఓటమి, ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలలో ఉన్న సొంత పార్టీ పైనా, ప్రభుత్వంపైనా ఉన్న అసంతృప్తిని బహిర్గతం చేసిందని అంటున్నారు.

YCP Social Media YSRCP

ముఖ్యంగా, వైకాపా ఎమ్మెల్యేలో అసమ్మతి కొత్త విషయం కాదు. చాలా కాలంగా చాలా మంది ఎమ్మెల్యేలో అసమ్మతి అగ్గి రగులు తూనే వుంది. భగ్గు మనేందుకు సిద్ధంగా వుంది. అయితే ఇంతకాలం పిల్లి మెడలో గంట కట్టేదేవరనే దగ్గర ఆగిన అసమ్మతి లావా ప్రవాహానికి స్వయంగా పార్టీ అధినాయకత్వమే గేట్లు ఎత్తేసింది. పొమ్మన కుండా పొగ పెట్టి ఆనం రామ నారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని బయటకు పంపిన పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి క్రాస్ వోటింగ్ సాకు చూపి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై సస్పెన్షన్ వేటు వేశారు.

దీంతో ఇక అసమ్మతి కట్టలు తెంచుకుంటుందన్న పార్టీ లో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని సస్పెన్షన్‌కు గురైన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు బహిరంగంగానే బయటికి వస్తున్నారని తెలిపారు.. మరో పార్టీలో చేరిక కోసం చాలా మంది ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు.2024 ఎన్నికలలో ఎవరికి ఓటేయాలన్న విషయంలో రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారా? ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాలలో జోరు తగ్గనుందా? రాజకీయ ప్రజా సునామీ రాబోతోందని అ సమ్మతి నేతల ప్రకటనలు. కడప మొదలు ప్రతి జిల్లాలోనూ, వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులు,కార్యకర్తలు జగన్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా నిట్టనిలువుగా చీలిపోయారని అంటున్నారు. అక్కడక్కడా రహస్య సమావేశాలు జరుగుతున్న సమాచారం అధినేతను కలవరానికి గురిచేస్తోంది . సీనియర్లకు సైతం నేరుగా జగన్ ను కలిసే పరిస్దితిలేదు.

పార్టీలో నాయకులకు అధిష్టానానికి అంతరం పెరగటానికి కారణం రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతున్న వ్యక్తి ఆజమాయిషీనా లేక అధినేత ఉదాసీనత, లేదా భజనపరుల మాటలు చెవికి ఇంపుగా వినిపిస్తూ కఠోర నిజాలను తెలియనివ్వని కోటరీ కనికట్టా అన్నది పార్టీలో చర్చనియాంశం. ఎది ఎమైనా అసమ్మతి గళాల గరం తో వేడెక్కిన వాతావరణానికి చల్లని ఫ్యాన్ గాలి ఉపశమనం ఇస్తుందా? లేదా రానున్న ఎన్నికల్లో నిజంగానే అనుకోని ఫలితాలని రిటర్న్ గిఫ్టుగా అ సమ్మతి నేతలు తిరిగి ఇస్తారా వేచిచూడాలి.

Like Reaction0Like
Like Reaction0Love
Like Reaction0Haha
Like Reaction0Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: AndhrapradeshHBDGlobalStarRamCharanJanasenaNaraLokeshPawanKalyanTdpYSJaganYsrcp
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.