Rx 100 లాంటి సూపర్ హిట్ చిత్రంతో తెలుగు సినిమా ప్రపంచంలోకి దూసుకోచ్చిన కార్తికేయ తరువాత విడుదలైన “హిప్పీ” చిత్రం ప్లాఫ్ అయినా మంచి అవకాశాలే దక్కించుకున్నాడు. “గుణ 369″ లాంటి మంచి కథాంశం కలిగిన చిత్రంలో నటించినా పెద్దగా పేరు రాలేదు.”90ml” తో ఉన్న పేరు పోయే పరిస్థితికి వచ్చేసాడు. నాని హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ చిత్రంలో విలన్ పాత్ర కాస్త ఊరటనిచ్చింది.
ఈసారి పరిశ్రమలోనే అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ లో బన్నీ వాసు నిర్మాణ సారథ్యంలో పి.కౌశిక్ అనే కొత్త దర్శకుడు రచన దర్శకత్వం లో “చావు కబురు చల్లగా” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రోజు కార్తీకేయ జన్మదినం సందర్భంగా యూనిట్ వారు ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసారు. మొదటి నుండి మాస్ బాటలో నడుస్తున్న కార్తికేయ ఈ చిత్రంలో కూడా మృతదేహాలను తరలించే వ్యాన్ డ్రైవర్ బస్తీ బాలరాజుగా పాత్రకి తగిన హావ భావాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. లావణ్య త్రిపాటి హీరోయిన్ గా ఆమని ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఈ చిత్రంతో అయినా పరిశ్రమలో తనకంటూ బలమైన ఫ్లాట్ఫామ్ ఏర్పరుచుకోవాలని ఆశిస్తూ ట్రెండ్ ఆంధ్రా.కామ్ తరపున కార్తికేయ గుమ్మికొండకి జన్మదిన శుభాకాంక్షలు.
