Karnataka Man Kills Delivery Boy : చేతిలో యాపిల్ ఐఫోన్ ఉంటే చాలు వాళ్లెంత రిచ్చో అనుకుంటారు చూసిన వాళ్లు.. ఐఫోన్ చాలా ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గానే కాకుండా స్టేటస్ సింబల్ కూడా భావిస్తారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా జనాల్లో ఐఫోన్ కి అంత క్రేజ్. యూత్ లో ఐఫోన్ కి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐఫోన్ కొనేందుకు కిడ్నీ కూడా అమ్మేస్తాం అనే మీమ్స్ సోషల్ మీడియాలో కూడా బాగా పాపులర్ అయ్యాయి.
కర్నాటకలో వీటికి కాస్త భిన్నంగా జరిగింది. ఓ యువకుడు ఐఫోన్ ఆర్డర్ చేసాడు. డెలివరీ బాయ్ ఆర్డర్ ఇంటికి తెచ్చాడు. ఆ టైంకి ఆ యువకుడి వద్ద డబ్బులు లేవు. అయితే సింపుల్ గా ఐటెమ్ రిటర్న్ చేయోచ్చు కానీ కర్ణాటకలోని హసన్ జిల్లాకు చెందిన హేమంత్ దత్ అనే 20 ఏళ్ల యువకుడు ఏకంగా దాన్ని ప్రెస్టీజియస్‌గా తీసుకొని..
ఎక్కడ పరువుపోతుందో అని.. డెలవరీబాయ్‌నే చంపేశాడు. నాలుగు రోజుల పాటు శవాన్ని ఇంట్లోనే ఉంచాడు. ఆ తర్వాత పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. దీంతో వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్ళు హేమంత్ ను ప్రశ్నించారు. చివరకు ఈ విషయం పోలీసుల వరకూ చేరింది. ఫిబ్రవరి 7న ఈ ఘటన జరిగింది.
ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్‌నంతా జల్లెడ పట్టారు. చివరకు నిందితుడు హేమంత్‌దత్.. బాటిల్‌లో పెట్రోల్ కొంటున్న దృశ్యాలు లభించాయి. ఆ ఎవిడెన్స్‌తో తీగ లాగితే డొంకంత కదిలింది. ప్రస్తుతం నిందితుడు హేమంత్‌దత్ పోలీసులు అదుపులో ఉన్నాడు.