Pawan Kalyan Watch Cost : సముద్రఖని దర్శకత్వంలో మెగా ఫ్యామిలీ హీరోలు పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ ఇద్దరూ కలిసి చేస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ BRO. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ మూవీ ఈ నెల (జూలై) 28న థియేటర్లలోకి రానుండగా.. ఈ నెల 25న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగింది. ప్రతి ఈవెంటులో మాట్లాడినట్టే ఈ ఈవెంటులో కూడా పవన్ కళ్యాణ్ స్పీచ్ తో అదరగొట్టేశారు.
అయితే ఈ ఫంక్షన్లో పవన్ కల్యాణ్ పెట్టుకున్న వాచ్ పైన అందరీ కళ్లు పడ్డాయి. దీంతో ఆ వాచ్ ధర తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆరా తీశారు. బ్రో ఈవెంట్లో పవన్ కల్యాణ్ ధరించిన వాచ్ బ్రెగ్యుట్ మైరెన్ క్రోనోగ్రాఫ్. ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచుల్లో ఒకటి. దీని ధర సుమారు రూ. 21,45,678 లని తెలుస్తోంది. ఇది చూసి అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘పవర్ స్టార్.. అంటే ఆ మాత్రం రేంజ్ ఉండాలి’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Regina Cassandra : నేను కూడా పోర్న్ స్టార్ అవ్వాలి అనుకున్నాను కానీ..
అలాగే అత్తారింటికి దారేదిలో పవన్ చెప్పిన డైలాగ్ ‘ వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిలైపోద్ది’ను గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మాత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించగా.. థమన్ ఎస్.ఎస్ సంగీతం అందించాడు. ఇక ఈ మూవీ టికెట్స్ ఆన్లైన్ లో పెట్టగానే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయాయి. మరికొన్ని గంటల్లో మూవీ వస్తుండడం పవన్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.