Ram Pothineni : రామ్ పోతినేని.. దేవదాసు మూవీతో చిన్న వయసులోనే ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు ఈ యంగ్ హీరో.. ఆ తర్వాత వరుసగా రెడీ, జగడం, గణేష్, మస్కా, పండగ చేసుకో, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్, ది వారియర్ వంటి ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇటీవల రామ్ నటించిన ది వారియర్ మూవీ భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది.
ప్రస్తుతం రామ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో RAPO అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ కాగా ఈ మూవీ ప్రస్తుతం మైసూర్ లో జరుపుకుంటుంది. దీనితో పాటు మొన్న రామ్ బర్త్ డే సందర్భంగా ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ మూవీని అంనౌన్స్ చేశాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఇదిలావుండ రామ్ పోతినేని కూడా పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు కాబోతున్నట్లు
సోషల్ మీడియాలో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. రామ్ చేసుకోబోయే భార్య బడా వ్యాపారవేత్త కూతురు అని తెలుస్తోంది. ఆమె ఫ్యామిలీ హైదరాబాద్ లో ఉంటుందట. త్వరలోనే వీరి పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇరువురి కుటుంబాల మధ్య చర్చలు జరిగాయట. RAPO మూవీ కంప్లీట్ అయ్యాక పెళ్లి చేసుకునే అవకాశం ఉందట. మొత్తానికి ఇటీవల టాలీవుడ్ హీరోలు మెల్లిగా ఒక్కొక్కరు పెళ్లి పీటలెక్కుతున్నారు.