Republic Day 2023 Quiz: రిపబ్లిక్ డే 2023 సంబరాలకు సమయం ఆసన్నమైంది. జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకలకు యావత్ దేశం సిద్ధమైంది. ఇంకొన్ని గంటల్లో ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగరేయనున్నారు. ఈ నేపథ్యంలో మనం అందరం ఇంత గొప్పగా చెప్పుకుని, వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటున్న రిపబ్లిక్ డే గురించి మీకు ఎన్ని విషయాలు తెలుసో తెలుసుకోవడానికి మీ ఐక్యూ చెక్ చేసుకోండి.
1) రాజ్యాంగం తొలిసారిగా అమలులోకి వచ్చిన ఏడాది ఎప్పుడు ?
ఎ) 1947
బి) 1948
సి) 1950
2) రాజ్‌పథ్ మార్గంలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించింది ఎప్పుడు ?
ఎ) 1947
బి) 1951
సి) 1955
3) భారత్‌తో పాటు రవింద్రనాథ్ ఠాగూర్ మరొక దేశానికి కూడా జాతీయ గీతం రచించారు. ఆ దేశం ఏది ?
ఎ) పాకిస్థాన్
బి) శ్రీలంక
సి) బంగ్లాదేశ్
4) ఈ ఏడాది ఇండియా 73వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది ?
ఎ) అవును
బి) కాదు
5) బీటింగ్ రిట్రీట్ సెరెమనీ ఏ రోజున జరుగుతుంది ?
ఎ) జనవరి 26
బి) ఆగస్టు 15,
సి) జనవరి 29
6) ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజున పరేడ్ ఎక్కడి నుంచి ముందుగా ప్రారంభం అవుతుందో తెలుసా ?
ఎ) ఇండియా గేట్
బి) రాష్ట్రపతి భవన్,
సి) రెడ్ ఫోర్ట్
7) రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న తొలి విదేశీ మిలిటరీ సైన్యం ఏది ?
ఎ) 2018 లో ఫ్రెంచ్ ఆర్మీ సోల్జర్స్
బి) 2020 లో బ్రిటీష్ ఆర్మీ సోల్జర్స్
సి) 2018 లో ఆస్ట్రేలియా ఆర్మీ సోల్జర్స్
పైన అడిగిన ప్రశ్నలకు జవాబు సరిచూసుకోండి..
1) 1950, 2) 1955 3) బంగ్లాదేశ్ 4) కాదు 5) జనవరి 29 6) రాష్ట్రపతి భవన్ 7) 2018 లో ఫ్రెంచ్ ఆర్మీ సోల్జర్స్