Sitara Ghattamaneni : మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ల ముద్దుల కుమార్తె సితార. చిన్నప్పటి నుంచే చాలా యాక్టివ్ గా ఉండే సీతారాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అప్పుడప్పుడు కొన్ని డ్యాన్స్ వీడియోలు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్‌ను ఆమోదించి అతిపెద్ద యాడ్ కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన మొదటి భారతీయ స్టార్ట్ కిడ్‌గా నిలిచిన విషయం తెల్సిందే.
ఆమె యాడ్లో కనిపించినందుకు గాను ఆమెకు భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారు. అయితే తాజాగా సితార ఘట్టమనేని మొట్టమొదటి కమర్షియల్ యాడ్ న్యూయార్క్ నగరంలోని ఫేమస్ టైమ్స్ స్క్వేర్ పై మెరిసింది. తన మొదటి యాడ్ నే ఈ రేంజ్ లో లాంచ్ అవ్వడం అంటే మాములు విషయం కాదు. దీంతో టైం స్క్వేర్ పై మెరిసిపోతున్న సితార మొదటి యాడ్ పిక్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
షూటింగ్స్ లేనప్పుడు సూపర్ స్టార్ ఎక్కువగా ఫ్యామిలీతో గడుపుతుండే విషయం తెలిసిందే. సితార యూట్యూబ్ లో అదరగొతుండగా.. కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడానికి కథల అన్వేషణలో ఉన్నాడు మహేష్. ప్రెసెంట్ మహేష్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారంలో నటిస్తున్నాడు. ఇందులో ఆయనకు జోడిగా శ్రీలీల నటిస్తుండగా.. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.