Palmistry : చాలామంది కష్టపడి జీవితంలో పైకి వస్తారు.కొంతమంది ఎంతగా పనిచేసినా, ఎంత కష్టపడినా అనుకున్నవి సాదించలేరు. మరికొంత మంది తక్కువ శ్రమ చేసినా,ఎక్కువ సంపాదనతో జీవితాన్ని సాఫీగా జీవిస్తారు. అయితే ఏదైనా సరే మన చేతిరాతను బట్టి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ప్రతి ఒక్కరికీ కూడా తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని తపన ఉంటుంది. ఆ విషయంలో మన చేతిలో రేఖలు మన భవిష్యత్తు ఏంటో చెప్పగలవు.చేతిరాతలు ఒక వ్యక్తి భవిష్యత్తు గురించే కాకుండా ,అతను ఎంత అదృష్టవంతుడో కూడా చెప్పగలవు.
స్పష్టమైన విధి రేఖ : చేతి మణికట్టు దగ్గర మొదలై మధ్యలో వరకు వెళ్లే ఈ రేఖను “విధి రేఖ” అని పిలుస్తారు. హస్తసాముద్రికం ప్రకారం ఎవరి చేతిలో అయితే ఈ రేఖ నిటారుగా ఉంటుందో వారి జీవితం ఎంతో అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉంటారు. వారికి డబ్బు కొరత అనేది ఉండదు. సమాజంలో మంచి పేరు ,ప్రతిష్టలు గడిస్తారు.
అరచేయి మృదువుగా గులాబి రంగుతో ఉంటే :ఈ వ్యక్తులు యొక్క అరచేయి గులాబి రంగులో ఉండి, అతని చేయి మృదువుగా ఉంటుంది. హస్త సాముద్రికం ప్రకారం వీరికి రాజయోగం రాసిపెట్టి ఉంటుంది. వారి జీవితంలో ఎప్పుడూ కూడా రాజుల వలె జీవిస్తారు. ఇకపోతే వీరికి చాలా మర్యాద ,గౌరవం విలువ ప్రతి చోట లభిస్తుంది.
గోళ్లపై అలాంటి గుర్తు చాలా శుభప్రదం : కొంతమంది గోర్లపైన చంద్రుడు లాగా గుర్తు ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. హస్త సాముద్రికం ప్రకారం ఇలా గుర్తు ఉన్నవారు చాలా శుభప్రదమైన వారిగా లెక్కలోకి వస్తారు. వారి జీవితంలో మంచి పురోగతి ఉండడమే కాకుండా, ప్రతి ఒక్క పనిలో విజయం సాధిస్తారు, వారి భవిష్యత్తులో కూడా వారు ఆశించిన ఫలితం కంటే ఎక్కువగానే ఉంటుంది.
గోర్లు మృదువుగా,గులాభి రంగులో ఉంటే : కొంతమంది చేతులు మరియు వారి గోర్లు చాలా మృదువుగా ఉంటాయి. అలా ఉన్న వారి జీవితం సుఖ,సంతోషాలతో అష్ట ,ఐశ్వర్యాలతో విరజిల్లుతుంది. వీరికి సమాజంలో మంచి గుర్తింపు, గుర్తింపుతో పాటు మంచి పేరు ,ప్రతిష్టలు లభిస్తాయి.