Smart Phone Usage : ఈ రోజుల్లో మొబైల్ లేకుండా ఎవరు ఉండరు. ఫోనుతో ,మనిషి అంతలా కనెక్ట్ అయిపోయాడు. ఏ పని చేయాలన్నా కూడా నిమిషాలలో ఫోన్ సహాయంతో చేసేస్తున్నారు. అలా ఫోన్ విపరీతంగా వాడడం దానికి అడెక్ట్ అవ్వడం వల్ల ఒక వింత ఫోబియా పుట్టుకొచ్చింది. దాని పేరే “నోమో ఫోబియా”.
ఈ ఫోబియాతో మనుషులు ఎప్పుడూ కూడా ఒక ఆందోళనతో ఉంటున్నారని అధ్యయనాల్లో తేలింది. స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల ప్రస్తుతం మన దేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురు నోమోఫోబియాకు గురి అవుతున్నారు అని ఒప్పో, కౌంటర్‌పాయింట్ రిసెర్చ్‌లో వెల్లడైంది. ఈ ఫోబియాతో బాధపడేవారు సెల్ ఫోన్ తమ నుండి ఎక్కడ దూరం అవుతుందో అని భయంతో ఉంటారు.

72 శాతం స్మార్ట్‌ఫోన్ వాడేవాళ్ళు సెల్‌ఫోన్ లో బ్యాటరీ 20 శాతం కంటే తక్కువ ఉంటే ఫోన్ ఆగిపోతుందనే ఆందోళనలో ఉంటారు. 65 శాతం మంది ఫోన్ బ్యాటరీ అయిపోతుంటే మానసికంగా ఇబ్బందికి గురవుతున్నారు. 25 – 30 ,31 – 40 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు ఈ నోమోఫోబియాతో బాధపడున్నారు.
