Yamaha Rx100 Release update – యమహా ఆర్ఎక్స్ 100 బైక్ లవర్స్ కి గుడ్ న్యూస్..
Yamaha Rx100 Release update – యమహా మోటార్ సైకిళ్ళలో బాగా క్లిక్ అయిన మోడల్ ఏదంటే యమహా ఆర్ఎక్స్ 100 అని టక్కున చెప్పేస్తారు. అయితే ఇప్పుడంటే యమహా లో ఎఫ్ జడ్, ఆర్15 అని, ఆర్ 1, ఆర్ 3, వివిధ రకాల మోడల్ అందుబాటులోకి వచ్చాయిగానీ ఒకప్పుడు మాత్రం ఆర్ఎక్స్ సిరీస్ మాత్రం అదరహో అనిపించింది. అయితే 98.2 సిసి ఇంజన్ తో 1985 వ సంవత్సరంలో విడుదలైన ఈ మోడల్ బైక్ 1996 వరకు దాదాపుగా 11 ఏళ్లపాటు ఒక ఊపు ఊపిందని చెప్పవచ్చు. కానీ 1996వ సంవత్సరం తర్వాత ఈ బైక్ ను తయారు చెయ్యడం యమహా సంస్థ నిలిపివేసింది. ఆ తర్వాత యమహాలో పలు బైకులు వచ్చాయి పోయాయి, కానీ యమహా ఆర్ఎక్స్ 100 రేంజ్ లో మాత్రం క్లిక్ కాలేకపోయాయి. అందుకే ఇప్పటికీ చాలామంది ఈ బైక్ ని రీ మోడలింగ్ చేయించుకుని మరీ వాడుతున్నారు.
Deepthi bhatnagar: ఘాటుగా అందాలు ఆరబోస్తూ మతి పోగొడుతున్న ఒకప్పటి హీరోయిన్

యమహా ఆర్ఎక్స్ 100 బైక్ రీ ఎంట్రీ:
అయితే తాజాగా యమహా సంస్థ ఆర్ఎక్స్ 100 బైక్ లవర్స్ కి గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆర్ఎక్స్ 100 బైక్ ని మళ్లీ మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఇటీవలే జరిగిన ఓ మోటో ఎక్స్ పో కార్యక్రమంలో యమహా సంస్థలు ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఇషిన్ చిహానా కూడా ఈ విషయంపై పలు ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. ఇందులో భాగంగా యమహా సంస్థలకు చెందిన యమహా ఆర్ఎక్స్ 100 ద్విచక్ర వాహనం చాలా స్పెషల్ అని అంతేకాకుండా ఈ బైక్ కి అప్పట్లో మంచి క్రియేట్ మరియు ట్రెండుని సెట్ చేసిందని తెలియజేశారు.
అందుకే యమహా ఆర్ఎక్స్ 100 బైక్ ని మళ్ళీ మార్కెట్లోకి తీసుకో వచ్చేందుకు సన్నహాలు చేస్తున్నట్లు కూడా గుడ్ న్యూస్ చెప్పాడు. కానీ ఆర్ఎక్స్ 100 ద్విచక్ర వాహనం మార్కెట్లోకి విడుదల అవడానికి ఇంకా కొంత సమయం పట్టేలా ఉందని కూడా తెలిపాడు. ఏదైతేనేం ఎంతోమంది డ్రీమ్ బైక్ ఆర్ఎక్స్ 100 మళ్ళీ మార్కెట్లోకి విడుదలవుతుందని విషయం తెలియగానే యమహా ఆర్ఎక్స్ 100 లవర్స్ ఒక్కసారిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆర్ఎక్స్ 100 బైక్ మళ్లీ మార్కెట్లోకి విడుదలైనా సరే ట్రెండ్ చేస్తుందని అందులో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు.
జావా బైక్స్ రీ ఎంట్రీ:
అయితే వింటేజ్ మోడల్ బైక్స్ పై ఆసక్తి పెంచుకున్నటువంటి కొందరు బైక్ పాతబడిన సరే వాటిని రిపేర్లు చేయించుకొని మరి వాడుతున్నారు. దీంతో కొన్ని ద్విచక్ర వాహన తయారీ సంస్థలు తమ సంస్థలకి సంబంధించిన కొన్ని మోడల్లను మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధం అవుతున్నాయి. కదా ఇప్పటికే ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన “జావా” తమ మోడల్ ని మళ్లీ మార్కెట్లోకి దింపింది. కాగా ప్రస్తుతం ఈ జావా మోటార్ సైకిల్స్ కూడా బాగానే సేల్ అవుతున్నాయి.