Deepthi bhatnagar: అప్పట్లో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకేక్కిన పెళ్లి సందడి చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది. కాగా ఈ చిత్రంలో హీరోగా తెలుగు ప్రముఖ హీరో శ్రీకాంత్ నటించగా ప్రముఖ వెటరన్ హీరోయిన్లు రవళి మరియు దీప్తి భట్నాగర్ తదితరులు హీరోయిన్లుగా నటించారు. అయితే ప్రస్తుతం శ్రీకాంత్ అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ రవళి మరియు దీప్తి భట్నాగర్ తదితరుల మాత్రం ఇండస్ట్రీకి కొంతమేర దూరంగా ఉంటున్నారు.
సోషల్ మీడియాలో దీప్తి భట్నాగర్ ఫొటోస్ వైరల్:
అయితే దీప్తి భట్నాగర్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగానే యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో తనకు సంబంధించిన అందమైన ఫోటోలు, వీడియోలు వంటివి షేర్ చేస్తూ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. కాగా తాజాగా దీప్తి భట్నాగర్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ ఫోటోలలో దీప్తి భట్నాగర్ కొంతమేర బోర్డ్ గా కనిపించింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు అవాక్కయ్యారు. అంతేకాకుండా ఒకప్పుడు సాంప్రదాయబద్ధంగా చీరకట్టులో కనిపించే దీప్తి భట్నాగర్ 55 ఏళ్ల వయసు తరువాత మళ్లీ ఇలా బోల్డ్ షో చేయడం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారు.
దీప్తి భట్నాగర్ సినీ కెరియర్:
అయితే దీప్తి భట్నాగర్ తెలుగులో మా అన్నయ్య, పెళ్లి సందడి, సుల్తాన్, కొండవీటి సింహాసనం తదితర చిత్రాలలో నటించింది. ఈ చిత్రాలన్నీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. కానీ దీప్తి భట్నాగర్ మాత్రం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ పై పెద్దగా దృష్టి సారించలేక పోయింది. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ కి చెందినటువంటి ఓ ప్రముఖ వ్యాపారవేత్త ని పెళ్లి చేసుకొని సెటిల్ అయింది. కాగా ప్రస్తుతం దీప్తి భట్నాగర్ కి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన దీప్తి భట్నాగర్ వ్యాపారంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దీప్తి భట్నాగర్ కి చేనేత వస్త్రాల పరిశ్రమలు కూడా ఉన్నాయి.