Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన జాన్వీ కపూర్. అందంతో పాటు అభినయాన్ని పునికిపుచ్చుకుంది జాన్వీ. దడక్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమా మరాఠిలో సూపర్ హిట్ అయిన సైరాత్ కు రీమేక్‌గా వచ్చింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. తాజాగా జాన్వీ కపూర్ నటించిన ‘బవాల్’ మూవీ ఓటీటీలో విడుదలైంది.
చరిత్ర, వర్తమాన అంశాల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు నితీష్ తివారి. అయితే దీనికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. తనకు హిస్టరీ సబ్జెక్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. స్కూల్ డేస్ నుంచి కూడా నాకు హిస్టరీ అంటే చాలా ఇష్టం. చరిత్రకు సంబంధించిన వ్యాసరచన పోటీలో కూడా బహుమతులు నాకే వచ్చేవి. మిగిలిన సబెక్స్ లో నార్మల్ సూడెంట్ నే.. కానీ హిస్టరీలో మాత్రం నాతో ఎవరూ పోటీపడలేరు.
Urfi Javed : పబ్లిక్ ఫిగర్ నే కానీ.. పబ్లిక్ ప్రపార్టీని కాదు..
ప్రపంచ చరిత్రపై నాకు పూర్తి అవగాహన ఉంది. నా సినీ కెరీర్లో హిస్టారికల్ సోరీస్ లో నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోకూడదు అనుకున్న.. అందుకే ‘బవాల్’ మూవీలో నటించాను. ఇందులో రెండవ ప్రపంచ యుద్ధ ప్రస్తావన ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ. ప్రస్తుతం జాన్వీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవరలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం కానుంది జాన్వీ కపూర్.
Rajinikanth : రజినీకాంత్ ఫౌండేషన్ మోసం..