Urfi Javed : బాలీవుడ్ టీవీ నటి, సోషల్ మీడియాలో పాపులర్ పర్సనాలిటీ ఉర్ఫీ జావెద్‌కు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హాట్ బ్యూటీగా అభిమానులను సంపాదించిన ఉర్పీ..అంతే కాంట్రవర్సీలను కూడా మూట గట్టుకుంది. ఓటీటీ బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది ఉర్ఫీ జావేద్. షో నుంచి ఎలిమినేట్ అయిన తొలి BB OTT కంటెస్టెంట్ ఆమె. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు వివాదాలతో బాగా ఫేమస్ అయ్యింది.

బిగ్ బాస్ OTT షో తర్వాత ఉర్ఫీ పలు టీవీ షోలలో నటించింది. ‘బడే భయ్యా కి దుల్హనియా’లో అవనీ పాత్రను పోషించి బాగా పేరు సంపాదించింది. అలాగే కొత్త కొత్త ఫొటో షూట్స్ తో కుర్రకారు మతిపోగొడుతుంటుంది. ఎవరూ ఊహించని విధంగా వెరైటీ ఔట్‌ఫిట్స్ లో దర్శనమిస్తూ.. ఉర్ఫీ జావెద్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంటుంది. ఇక తాజాగా తనకు జరిగిన చేదు అనుభవాన్ని వివరించింది. ఓ వెకేషన్ కోసం ముంబై నుంచి గోవాకు విమానంలో వెళ్తున్న తనను
Rajinikanth : రజినీకాంత్ ఫౌండేషన్ మోసం..
మద్యం మత్తులో ఓ వ్యక్తి టీజ్ చేసిన విషయాన్ని ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకుంది ఉర్ఫీ. ‘నిన్న ఫ్లైట్ లో గోవాకు వెళ్తుండగా జర్నీలో ఈవ్ టీజింగ్ కు గురయ్యాను. ఒకతను నన్ను వేధించడం మొదలు పెడితే కోపం వచ్చి నేనూ వాదించా. అతను మద్యం మత్తులో అలా మాట్లాడుతున్నాడని, అతని ఫ్రెండ్స్ చెప్పారు. కానీ ఎంత తాగి ఉన్నప్పటికీ ఇలా ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని క్షమించలేం. నేను పబ్లిక్ ఫిగర్ నే కానీ.. పబ్లిక్ ప్రాపర్టీ మాత్రం కాదు కదా అంటూ చెప్పుకొచ్చింది ఉర్ఫీ.
Prabhas : ఆ మూవీలో నేనే కమిడియన్ ని..