KYC Fraud : ఈ మధ్య కాలంలో కొందరు కేటుగాళ్ళు కష్టపడకుండా డబ్బు సంపాదించాలని ఆలోచిస్తూ ఆన్లైన్ మోసాలకి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో సైబర్ క్రైమ్ కేసులు రోజురోజుకీ ఎక్కువవయాఉతున్నాయని చెప్పవచ్చు. అయితే ఈ కేటుగాళ్ళు రోజురోజుకీ కొత్త కొత్త పద్దతులను అనుసరిస్తూ కోట్ల రూపాయల ఆర్థిక మోసలకి పాల్పడుతున్నారు. దీంతో ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులు, బ్యాంక్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకి సూచిస్తున్నప్పటికి సైబర్ నెరగాళ్లు మరింత అడ్వాన్స్ గా వ్యవహరిస్తున్నారు.
ఓటీపీ తో బ్యాంక్ ఖాతాలో ఉన్న సొమ్ము ఖాళీ:
ఇంతకుముందు బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఓటీపీ తో బ్యాంక్ ఖాతాలో ఉన్న సొమ్ముని ఖాళీ చేసేవారు. దీంతో ఓటీపీ ఎవరికీ షేర్ చేయవద్దని అవగాహన కల్పించడంతో ఓటీపీ అవసరం లేకుండా కేవలం లింకు పై క్లిక్ చేసి నగదుని మాయం చేసే ట్రిక్స్ కనుగున్నారు. దీంతో ఈ మధ్యకాలంలో అభంశుభం తెలియని అమాయకులు ఈ పద్దతి ద్వారా లక్షలు పోగొట్టుకున్న సంఘటనలు కోకొల్లలు.

Chandrababu Naidu’s New Strategy : చంద్రబాబునాయుడు కొత్త వ్యూహం.. టీడీపీని నిలబెడుతుందా..?
నకిలీ లింకులతో మోసం:
ఇక పూర్తీ వివరాల్లోకి వెళితే ఇటీవలే ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) అధికారులు బ్యాంక్ ఖాతాలు వినియోగిస్తున్న వారికి పలు అప్రమత్త హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా కొందరు సైబర్ నెరగాళ్లు కెవైసీ పేరుతో ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని ఈ క్రమంలో వినియోగదారులకి లింకు ని పంపి క్లిక్ చెయ్యమని అడుగహతున్నారని తెలిపారు. దయచేసి ఇలాంటి లింకులపై క్లిక్ చేయడంగానీ, బ్యాంక్ ఖాతా లేదా వ్యక్తిగత వివరాలు తెలియజేయవద్దని హెచ్చరించారు.
Sivaji : హీరో శివాజీ ఒకప్పుడు అలాంటి పని చేసేవాడని మీకు తెలుసా..?
అలాగే ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న పోలీసులకి సమాచారం అందించాలని తెలిపారు. ఒకవేళ మీ బ్యాంక్ ఖాతాలో ఏవైనా అవకవతవకలు ఉన్నట్లయితే మీ దగ్గరిలో ఉన్న సంబందిత బ్యాంక్ బ్రాంచి ని సంప్రదించాలని అంతే తప్ప కస్టమర్ కేర్ లేదా ఇతర వ్యక్తులకి ఖాతా వివరాలు ఇవ్వద్దని హెచ్చరించారు.
నకిలీ లింకులపై క్లిక్ చేసి 10 వేలు పోగొట్టుకున్న యూఆవకుడు:
అయితే ఈ విషయం ఇలా ఉండగా హైదరాబద్ కి చెందిన ఓ యువకుడు ఇటీవలే కెవైసీ ని ధృవీకరించాలని తన ఫోన్ కి వచ్చిన లింకు పై క్లిక్ చేశాడు. దీంతో లింకుపై క్లిక్ చేయగానే దాదాపుగా 10 వేల రూపాయలు అకౌంట్ నుంచి మాయం అయ్యాయి. దీంతో ఆ యువకుడు లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.