Pushpa 2 Latest Update : పుష్ప 2… అస్సలు తగ్గడం లేదట..!!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పుష్ప ది రూల్. ఈఏడాది మచ్ అవైటెడ్ సినిమాల్లో ఇది ఒకటి. పుష్ప ది రైజ్ కు సీక్వెల్ గా వస్తుంది.ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లోవుంది. రామోజీఫిలిం సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో జాతర ఎపిసోడ్ ను తెరకెక్కిస్తున్నారు. ఇంటర్వెల్ ముందు వచ్చే ఎపిసోడ్ కావడంతో సుకుమార్ ఎక్కడా తగ్గడం లేదట. గత నాలుగు నెలల నుండి ఈ ఒక్క ఎపిసోడ్ నే చిత్రీకరిస్తున్నారు. ఎన్ని రోజులు అయినా పర్లేదు కానీ ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కిస్తున్నాడట.
సినిమాలో ఈసన్నివేశాలు హైలైట్ అవ్వనున్నాయట. అటు అల్లు అర్జున్ కూడా ఎలాంటి షరతులు పెట్టడం లేదట. ఎన్ని రోజులైనా పర్లేదు కానీ బాగా రావాలని చెప్పాడట. ఇక రిలీజ్ డేట్ విషయం లో కొంచెం గందరగోలం నెలకొంది.
Pushpa 2 Latest Update : Release date August 15..?
ఆగస్టు 15న రిలీజ్ చేయాలని పట్టుదలతో వుంది చిత్ర బృందం.. అయితే అప్పటివరకు సినిమా రెడీ అవుతుందా అనేది డౌటే. సుకుమార్ ఎక్కడ తగ్గకపోవడంతో ఇప్పటివరకు సగం షూటింగ్ మాత్రమే పూర్తయింది. అనుకున్న డేట్ కు రావాలంటే ఇంకొంచెం స్పీడ్ పెంచాలి.మరి ఎలాగైనా ఆ డేట్ ను అందుకుంటుందో లేదో చూడాలి.
Allu Arjun : ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తో సెన్సేషనల్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్…
Pushpa 2 Latest Update : Music Director Planning Item Song..
దాదాపు ఫస్ట్ పార్ట్ లో వున్న వాళ్లే సెకండ్ పార్ట్ లో కూడా వుండనున్నారు. సినిమాలో ఐటెం సాంగ్ ను కూడా ప్లాన్ చేస్తున్నారట. ఫస్ట్ పార్ట్ లో సమంత తో చేయించిన ఐటెం సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది దాంతో పుష్ప 2 లోకూడా అలాంటి ఐటెం సాంగ్ నే పెట్టాలనుకుంటున్నారట. ఇక ఈసినిమాకు కేవలం సౌత్ లోనే నార్త్ లోనూ భారీ క్రేజ్ ఉంది. పుష్ప అక్కడ 100కోట్లు కొల్లగొట్టింది. ప్రమోషన్స్ కూడా చేయకున్నా కూడా అక్కడ బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ పుష్ప 2ను ఈసారి అల్లు అర్జున్ భారీ లెవెల్లో ప్రమోట్ చేయనున్నాడు. ఈసినిమాకు రాక్ స్టార్ దేవి ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.