Allu Arjun : ఇంస్టాగ్రామ్ ఇప్పుడు ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇది ట్రెండ్ సృష్టించింది. దీన్ని ఫాలో అవని వాళ్ళు అంటూ లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతలా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది ఇంస్టాగ్రామ్. అయితే ఇంస్టాగ్రామ్ లోనే సెన్సేషనల్ సృష్టించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇంస్టాగ్రామ్ అకౌంట్లో తన పేరును లిఖించి కొత్త చరిత్ర సృష్టించాడు.
ఇంస్టాగ్రామ్ తెలుసు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెలుసు, మరి ఇంస్టాగ్రామ్ అకౌంట్ పేజ్ ఏంటి అని అనుకుంటున్నారా..! ఇంస్టాగ్రామ్ వాళ్ళు అఫీషియల్ గా ఒక అకౌంట్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది అందరికీ ఉండే సాధారణ అకౌంటె కానీ దీన్ని హ్యాండిల్ చేసేది మాత్రం ఇంస్టాగ్రామ్ టీమ్. దీంట్లో దాదాపుగా 654 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే దీనికి ఉన్న క్రేజ్ ని అర్థం చేసుకోవచ్చు.
అలాంటి ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పేజీలో అల్లు అర్జున్ ఇప్పుడు ట్రెండ్ అయి కూర్చున్నాడు. ఎందుకంటే ఇంస్టాగ్రామ్ అకౌంట్లో ఎప్పుడో అరుదుగా మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి ఇంస్టాగ్రామ్ అకౌంట్ పేజీలో ఈ సౌత్ ఇండియా స్టార్ హీరో అయినటువంటి అల్లు అర్జున్ వీడియోని పోస్ట్ చేశారు. ఇది మామూలు విషయం కాదు. ఇది మొదటిసారి ఒక సౌత్ ఇండియా స్టార్ కు దక్కిన అరుదైన గౌరవం.
ఇదే ఇప్పుడు త్రూ అవుట్ వరల్డ్ సెన్సేషనల్ అయింది,అలాగే బన్నీని చరిత్రకెక్కేలా చేసింది. ముఖ్యంగా చాలా రేర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యే వాళ్లను, ఇన్స్టాగ్రామ్ టాప్ ఇన్ప్లూయెన్సర్ను, వరల్డ్ మోస్ట్ పాపులర్ సెలబ్రిటీలను, వారి జెర్నీకి సంబంధించిన వీడియోలను రీల్స్‌గా ఫోటోలుగా ఈ అకౌంట్లో షేర్ చేస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ టీం. ఇప్పటివరకు ఇందులో మొత్తంగా 7,482లో పోస్ట్ మాత్రమే ఈ టీమ్ పోస్ట్ చేసింది. అయితే ఈ జాబితాలోకి అల్లు అర్జున్ చేరాడు. దాదాపు 20 మిలియన్ ఫాలోవర్స్ తో తన క్రేజీ ఉన్న ఇన్‌స్టాలో ట్రెండ్ అయింది. ఈ స్టార్ లైఫ్ లో చిన్న రీల్ లో తన ఫాలోవర్స్ ముందుకు తీసుకొచ్చింది.