Kumari Aunty Food : బిగ్ బాస్ కీర్తి భట్ విమర్శలకు కుమార్ ఆంటీ కౌంటర్.. ఇచ్చి పడేసిందిగా
ఫుడ్ స్టాల్ నడుపుతూ కుమారి ఆంటీ సోషల్ మీడియాలో పొందిన గుర్తింపు అంతా ఇంతా కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కుమారి ఆంటీ అంటే తెలియనివారుండరేమో. కుమారి ఆంటీ క్రేజ్ పెరుగుతుండడంతో మీడియానే ఆమె వెంటపడి మరింత క్రేజ్ పెంచుతున్నారు. జనాలు కుమారి ఆంటీ ఫుడ్ కోసం ఎగబడుతున్నారు.
అంతా కుమారి ఆంటీ ఫుడ్ పై ప్రశంసలు కురిపిస్తుంటే.. సీరియల్ నటి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ మాత్రం తనకి కాబోయే భర్తతో కలసి కుమారి ఆంటీ ఫుడ్ పై విమర్శలు చేసింది. తనకి కాబోయే భర్తతో కలసి కీర్తి భట్ ఓ యూట్యూబ్ వీడియో చేసింది. దీనికోసం కుమారి ఆంటీ ఫుడ్ తినింది. కానీ టేస్ట్ అసలు బాగోలేదని.. చికెన్ అయితే కారంగా ఉందని కీర్తి భట్ విమర్శలు చేసింది.

కీర్తి భట్ విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనితో కుమారి ఆంటీ స్పందించింది. కుమారి ఆంటీ హుందాగా మాట్లాడుతూనే కీర్తికి కౌంటర్ ఇచ్చింది. కీర్తి వచ్చిన రోజు నేను ఊర్లో లేను. మగవాళ్ళు వంట చేస్తే ఆడవాళ్ళలాగా చేయడం కష్టం. కాబట్టి కీర్తికి ఆ రోజు ఫుడ్ అలా అనిపించి ఉండొచ్చు.
కానీ నేను చేసే వంటలు ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు అని కుమారి ఆంటీ హుందాగా బదులిచ్చింది. ఒకరి గురించి పబ్లిక్గా విమర్శలు చేయడం ఎందుకు అని నెటిజన్లు కీర్తి భట్ ని ట్రోల్ చేస్తున్నారు. ఫుడ్ బాగాలేకపోతే అంతమంది జనాలు తినరు అని అంటున్నారు.
