Konidela Surekha : పవన్ కళ్యాణ్ కోసం హీరోయిన్ కి అబద్దం చెప్పి పిలిపించిన కొణిదెల సురేఖ.. ఇంత జరిగిందా..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు. పాలిటిక్స్ కారణంగా పవన్ తాను నటించాల్సిన చిత్రాలన్నింటికీ బ్రేక్ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ తో కెరీర్ బిగినింగ్ లో నటించిన ఓ క్రేజీ హీరోయిన్ ఆ మధ్యన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. హోమ్లీ గా తెలుగు ప్రేక్షకులను అలరించి ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్న రాశి. పవన్ కళ్యాణ్ రాశి జంటగా గోకులంలో సీత చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక చాలా ఆసక్తికరంగా జరిగిందట. ఈ విషయాన్ని స్వయంగా రాశి వివరించింది. గోకులంలో సీత పవన్ కళ్యాణ్ రెండవ చిత్రమే. దీనితో చిరంజీవి, సురేఖ అన్ని విషయాలు దగ్గరుండి చూసుకునేవారట.
ఈ చిత్రం కోసం హీరోయిన్ ని వెతుకుతున్న సమయంలో చిరు సతీమణి సురేఖ ఒక చిత్రంలో రాశిని చూసిందట. ఈ అమ్మాయి అయితే కళ్యాణ్ బాబు పక్కన బావుంటుంది. కథకి కూడా సెట్ అవుతుంది అని భావించిందట. దీనితో రవిరాజా పినిశెట్టి ద్వారా సురేఖ.. రాశి ఇంటి ఫోన్ నంబర్ తీసుకుని మేనేజర్ చేత ఫోన్ చేయించింది. చిరంజీవి గారు రమ్మంటున్నారు అని అబద్దం చెప్పించింది.

దీనితో చిరంజీవి గారు పిలుస్తున్నారు.. ఏదైనా సినిమా కోసం ఏమో అనే ఉద్దేశంతో రాశి తన ఫోటో ఆల్బమ్ మొత్తం తీసుకుని చిరంజీవి ఇంటికి వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసింది.. పిలిచింది చిరంజీవి గారు కాదు.. సురేఖ గారు అని. రాశి ఫోటో ఆల్బమ్ మొత్తం సురేఖ చూశారట. ఈ అమ్మాయి ట్రెడిషనల్ గా చాలా బావుంది. వెస్ట్రన్ డ్రెస్సులు కూడా వేసి ఫోటో షూట్ చేయండి అని చెప్పిందట.
అంత ఒకే అయ్యాక గోకులంలో సీత చిత్రంలో నువ్వే హీరోయిన్ అని ప్రకటించారట. ఆ విధంగా సురేఖ తన బిడ్డ లాంటి మరిది పవన్ కళ్యాణ్ కోసం హీరోయిన్ ని సెలెక్ట్ చేసింది.
