Alia Bhatt Latest Pics : బాలీవుడ్ హాట్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె నటనకీ, అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇటీవల ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి. ప్రేమించిన రణ్ బీర్ ని పెళ్లి కూడా చేసుకుని, మాతృత్వపు మాధుర్యాన్నీ అనుభవిస్తుంది అలియా. అలాగే బాలీవుడ్ చిత్రాలతో పాటు హార్ట్ ఆఫ్ స్టోన్ అనే అమెరికన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తుంది. అంతేకాదు అనేక ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యహరిస్తూ ఇటు సినిమాల ద్వారా, అటు వాణిజ్య ప్రకటనల ద్వారా రెండు చేతులా సంపాదిస్తుంది అలియా..