Anupama Parameswaran Latest Pics : అనుపమా పరమేశ్వరన్.. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే ఊహించని రేంజ్ హిట్ అయ్యింది. అలాగే తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత హీరో హీరోయిన్ లుగా వచ్చిన ‘అ ఆ’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఫస్ట్ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ప్రస్తుతం అను చేతిలో టిల్లు స్వ్కేర్, ఈగల్ తో పాటు తమిళ్ లో ఒకటి, మలయాళంలో మరొకటి చేస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్లు తెగ లైక్స్ కొట్టేస్తున్నారు.