Chiranjeevi – Sridevi Remuneration : తెలుగు సినిమా ఇండస్ట్రీలో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఎంత పెద్ద హిట్ అనేది మీకు అందరికీ తెలిసిందే. అప్పట్లో జనాలను ఒక ఊపు ఊపేసిన సినిమా ఇది. చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కొట్టి, అప్పటి నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా నిర్మాత అయినటువంటి అశ్వినిదత్తు ఈ సినిమా గురించి చాలా విషయాలను బయటపెట్టారు.
చిరంజీవి, శ్రీదేవి జోడి అంటేనే అదొక సూపర్ డూపర్ కాంబినేషన్. వారిది ఎవర్ గ్రీన్ జోడీగా సినిమా ఇండస్ట్రీలోనే పేరుపొందింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని అశ్విని దత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమాకు చిరంజీవి, శ్రీదేవి రెమ్యూనరేషన్ గురించి ఆయన బయటపెట్టారు. అప్పట్లో ఈ సినిమా 7 కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది.
ఆ రోజుల్లో ఏడు కోట్లు అంటే ఇప్పుడు కొన్ని వందల కోట్లతో సమానమని చెప్పారు. అశ్వినిదత్ అయితే ఈ సినిమా గాను చిరంజీవి 35 లక్షలు రెమ్యునరేషన్ తీసుకోగా, శ్రీదేవి కూడా హీరోలకు తగ్గట్టుగా ఆ రోజుల్లో రెమ్యూనరేషన్ తీసుకున్నారని ఈ సినిమా గాను శ్రీదేవి రెమ్యూనరేషన్ వచ్చేసి 25 లక్షలని అశ్విని దత్తు తెలిపారు.
అన్ని లక్షలు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అప్పటి ఆ రెమ్యూనరేషన్ ఇప్పుడు హీరోలు తీసుకునే వందల కోట్లతో సమానమని అశ్విని దత్తు చెప్పారు. ఆ సినిమా చిరంజీవి, శ్రీదేవిని ప్రత్యేక గుర్తింపు తేగా నిర్మాతగా నన్ను కూడా నిలబెట్టిందని అశ్విని దత్తు ఇంటర్వ్యూలో వెల్లడించారు.