Ketika Sharma Hot Pics : కేతిక శర్మ హీరోయిన్గా యాక్ట్ చేయకముందే ప్రేక్షకులకు తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది. డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయి సోషల్ మీడియా సెలబ్రిటీగా మారింది. మొదటి చిత్రానికి ముందే మిలియన్ల ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది కేతిక. ఆకాశ్ పూరీ హీరోగా చేసిన రొమాంటిక్ చిత్రంతో కేతిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా పెద్దగా ఆడనప్పటికీ.. కేతిక గ్లామర్ గురించి అందరూ మాట్లాడుకున్నారు. ఇక ఈ సినిమా చేస్తున్న టైంలోనే నాగశౌర్య లక్ష్యలో, మెగాహీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి రంగరంగ వైభవంగా సినిమా చేసింది. తాజాగా పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతోనైన అమ్మడి ఖాతాలో హిట్ పడుతుందేమో చూడాలి.