Animals to watch on Diwali : దీపావళి అంటేనే చీకట్లను పారద్రోలి వెలుగులు తీసుకొచ్చే పండుగ. ఆరోజు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని అందరూ నమ్ముతారు. అందుకే ఇల్లు మొత్తం దీపాలతో అలంకరించి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. అయితే దీపావళి రోజు కొన్ని జంతువులను చూస్తే మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..
ఆవు : హిందూ మతంలోని శకున శాస్త్ర ప్రకారం ఆవుకి తల్లి హోదా ఉంటుంది. దీపావళి రోజున కుంకుమపువ్వు రంగులో ఉన్న ఆవును చూడడం శుభప్రదం అని చెప్తారు. అవును ఆ దైవ స్వరూపంతో పోల్చుతారు. శకున శాస్త్రం ప్రకారం దీపావళి రోజున ఆవును చూస్తే మీ కుటుంబానికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గుడ్లగూబ : గుడ్లగూబ లక్ష్మీదేవి యొక్క వాహనం. అందుకే గుడ్లగూబ చాలా పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది. ఒకవేళ దీపావళి రోజున గుడ్లగూబ కనిపిస్తే అదృష్టం మిమ్మల్ని వరించినట్టే. జీవితంలో ఆర్థిక లాభం మీకు చేకూరినట్టే. ఒకవేళ దీపావళి రోజున రాత్రి కలలో గుడ్లగూబ దూరంగా వెళుతున్నట్లు కనిపిస్తే మాత్రం అది మీ ఆర్థిక నష్టానికి సంకేతం.
బల్లులు : మనలో సర్వసాధారణంగా చాలామందికి బల్లులు అంటే భయం ఉంటుంది. అవి ఎప్పుడూ మన ఇంటి గోడల మీద కనబడి భయపెడుతూనే ఉంటాయి. అయితే దీపావళి రోజు ఇంట్లో బల్లిని చూస్తే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. దీపావళి రోజు బల్లి చూడడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందినట్టు లెక్క. దీపావళి రోజు రాత్రి లక్ష్మీ గణేశుని పూజ తర్వాత బల్లి కనిపిస్తే చాలా శుభప్రదం.
పిల్లి : సాధారణంగా పిల్లి కనిపిస్తే అపశకునంగా భావిస్తారు. కానీ దీపావళి రోజున పిల్లి కనిపించడం శుభప్రదం అని చెబుతున్నారు. పిల్లిని చూడడం వల్ల ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.
ఎలుక : దీపావళి రోజున ఎలుక కనిపిస్తే చాలా మంచిది. ఎలుక కనిపించడం డబ్బు రాకకు సూచికగా చెప్తారు. కాబట్టి ఆ రోజు ఇంట్లోకి ఎలుక వస్తే తరిమి కొట్టకండి.