Astrology : మనలో చాలా మంది ఏ పని చేయాలి అనుకున్నా.. వారం,ముహూర్తం చూసుకొని చేస్తారు. పనిలో ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరగాలి అంటే, ఏ రోజు ఏ పనిచేస్తే మంచి జరుగుతుందో, మనకు వాస్తు శాస్త్రం స్పష్టంగా తెలియ చెబుతోంది. కొన్ని పనులు ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. అలా చేయడం ద్వారా అరిష్టం కలుగుతుంది అని పండితులు సూచిస్తున్నారు.
చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు,సమయం, సందర్భం లేకుండా గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడంలాంటివీ చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా కష్టాలను కోరి తెచ్చుకున్నట్టే. వాటికి ఒక ప్రత్యేకమైన రోజు ఉంటుంది. అలా వాటిని పాటిస్తే జీవితంలో కష్టాలను అధిగమించొచ్చు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
వాస్తు శాస్త్రం ప్రకారం జుట్టు కత్తిరించుకోవడానికి, గోళ్లు తీసుకోవడానికి బుధ, శుక్రవారాలు అనువైన రోజులు. ఇలా చేయడంవల్ల మంచి ఫలితాలు వస్తాయి.ఇలా మిగతా రోజుల్లో గోర్లు తీయడం,జుట్టు కత్తిరించడం వల్ల మంచి జరగదు అని వాస్తు శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఆ రోజుల్లో అసలు చేయకూడదు.