Benefits of Deepam in Front of the House : దీపం అంటే పరబ్రహ్మ స్వరూపం. చీకట్లను పారదోలి వెలుతురుని ఇచ్చి కాంతి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరిలో నిపుతుంది. అజ్ఞాన అంధకారాన్ని తొలగించే జ్ఞాన జ్యోతి. మనం చేసే ఏ కర్మకైనా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించడమే దీపం యొక్క విశిష్టత. మన సంప్రదాయం ప్రకారం దీపాన్ని వెలిగించకుండా ఎటువంటి కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారు. దీపానికి అంత ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ దీపాన్ని నూనె లేదా నెయ్యితో వెలిగిస్తారు.
దీప జ్వాల ఎప్పుడు కూడా ఊర్ధ్వముఖంగా సాగుతూ ఉంటుంది. మనుషుల లోపల ఉన్న కోరికలకు ప్రతీక. దీపంలో వేసే వత్తి అహంకారానికి ప్రతీకగా చెబుతారు. అహంకారాన్ని కాల్చేసి, కోరికలను ఆవిరి చేయడానికి ప్రత్యేకంగా దీపాన్ని వెలిగిస్తారని మన శాస్త్రాలలో రాసిపెట్టి ఉంది. దీప కాంతిలో వచ్చే వెలుగును దైవదర్శనంగానే భావించాలి. అయితే సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రతిరోజూ దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది.
లక్ష్మీదేవిని ఆ ఇంట్లోకి స్వాగతం పలికినట్టు అవుతుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభాలు కూడా తొలగిపోతాయి. మీ ఇంటి ముందు ప్రతిరోజు సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగిస్తే, కుటుంబ సభ్యుల జాతకాల్లో ఉన్న జాతక దోషాలు తొలగిపోయి, ఆ ఇల్లు సుఖసంతోషాలతో వెలుగుతుంది. ప్రతికూల శక్తులు కూడా ఇంట్లోకి రావు. ప్రధాన ద్వారం వద్ద కుడి వైపున దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించడం వల్ల ఆ ఇంటి వాతావరణం మొత్తం శుద్ధి అవుతుంది. క్రిమి, కీటకాలు కూడా నశిస్తాయి.