Chanakya Neeti : చాణక్యుడు బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజనీతి శాస్త్రంలో దిట్ట, ఆర్థిక శాస్త్రంలో ఆరితేరిన మేధావి, చాణిక్యనీతి చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. చాణక్యుడు చెప్పిన ఎన్నో విషయాలు మనిషి మనుగడకు మార్గాన్ని చూపిస్తాయి. ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయి.
చాణక్యుడు తన నీతిశాస్త్రంలో స్త్రీల గురించి చాలా విషయాలు ప్రస్తావించాడు. పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందని చాణుక్యుడు చెప్పాడు. అయితే పురుషుల జీవితంలో ఎటువంటి స్త్రీ ఉంటే అతను విజయం సాధించగలడు అనేది ఇప్పుడు చూద్దాం.
విద్యావంతురాలైన స్త్రీ : చదువుకున్న స్త్రీ అయితే సంస్కారవంతురాలుగా, మంచి ప్రవర్తన కలిగి ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తుంది. వాళ్లు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా సక్రమమైన తీరు ఉంటుంది. వీరు ఎప్పుడు కూడా జీవితంలో వెనుకడుగు వేయరు. ప్రతిదానికి సమయస్ఫూర్తితో ఆలోచించి, మంచి విజయాలను పొందుతారు.
కోరికలు అదుపులో ఉంచుకొనే స్త్రీలు.. సహజంగా స్త్రీలకు కోరికలు,ఆశలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది స్త్రీలు ఇంటి పరిస్థితులను అర్థం చేసుకొని, భర్తకు తోడుగా ఉంటారు. భర్త మాటను జవదాటకుండా,భర్త అడుగుజాడల్లో నడిచి కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ ఉంటారు. అలా ఉండడమే కుటుంబానికి, ఆ స్త్రీకి మంచిదని చాణిక్య నీతి చెబుతుంది.
మంచి మాటతీరు కలిగిన స్త్రీ : మనం ఎదుటివారికి ఇచ్చే మర్యాదను బట్టి, మన మాటను బట్టి ,ఎదుటివారు కూడా మనతో అలానే ప్రవర్తిస్తారు. ఒక ఇంటి ఇల్లాలి మాట తీరు బాగుంటే, ఆ ఇంటి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆ కుటుంబ గౌరవం కూడా పెరుగుతుంది. మంచి అనుబంధాలు పెరుగుతాయి.
మంచి స్వభావం గల స్త్రీ : మంచి స్వభావం కలిగిన స్త్రీలు కుటుంబంలో కీలక పాత్ర పోషిస్తారు. వారు ఆ కుటుంబానికి ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వగలుగుతారు. అలాగే అన్నింట్లోనూ వీళ్లు ముందుంటారు. ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వాటిని చాలా తెలివిగా పరిష్కరించి, కుటుంబ అభివృద్ధికి తోడవుతారు.