Crow : కాకి ఇంటి పైన వాలి అదే పనిగా అరుస్తుంటే.. ఇంటికి బంధువులు వస్తారని మన పెద్దలు చెప్తుంటారు. అయితే కొన్ని సంప్రదాయాల ప్రకారం కాకులకు ప్రత్యేక స్థానం కూడా ఉంది. మన పితృదేవతల రూపంలో కాకులు వస్తాయని చెప్తుంటారు. అలాగే పిత్రుదేవతలకు పిండాల సమర్పించినప్పుడు, కాకుల రూపంలో వచ్చి పిండాలని తిని వెళుతుంటాయని చాలా మంది విశ్వాసిస్తారు.
కాకులకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. మనుషుల మరణం గురించి కాకులకు ముందే తెలిసిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే అదే పనిగా కాకులు కనిపిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటే మనకు ఏదైనా దుష్పరిణామం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో నుండి బయట పడాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కాకులు మన దగ్గరకు వచ్చి అదే పనిగా అరుస్తూ ఉంటే ఒక మంత్రాన్ని జపిస్తే దాని నుంచి విముక్తి పొందవచ్చు.
అని శాస్త్రంలో ఉందని నిపుణులు చెబుతున్నారు. ఓం ప్రాం;ప్రిం ప్రాణాయ నమః.. శనీశ్వరాయ నమః ఓం శ్రీం ప్రాణానహ శనీశ్వరాయ నమః మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల శని ప్రభావం మన మీద ఉంటే తొలగిపోతుంది. అలాగే కాకుల వల్ల ఏర్పడిన ఇబ్బంది కూడా పోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ మంత్రాన్ని జపించడం వల్ల శని దేవుని అనుగ్రహం మీ మీద ఉంటుంది.