• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

Dussehra : 30 ఏండ్ల తర్వాత అరుదైన ముహూర్తం లో దసరా పండుగ.. దుర్గామాతను ప్రసన్నం చేసుకోండిలా..

Rama by Rama
October 13, 2023
in Latest News, Special Stories, ఆధ్యాత్మికం
251 2
0
Dussehra : 30 ఏండ్ల తర్వాత అరుదైన ముహూర్తం లో దసరా పండుగ.. దుర్గామాతను ప్రసన్నం చేసుకోండిలా..
492
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

Dussehra : ఈ రోజు మనం ఒక పండుగ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం.. మన భారతదేశము పండుగలకు పుట్టినిల్లు అనేది మనందరికీ తెలిసిన విషయమే.. కదా…అలాగే సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆచారాలకు కూడా భారతదేశం పేరుగాంచింది. సంవత్సరానికి ఒకసారి అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ దసరా పండుగ. దసరా వచ్చిందంటే నవరాత్రులు ఇక జాతరే జాతర. ఆ తొమ్మిది రోజులు వాతావరణం చాలా ప్రత్యేకతను సంతరించుకుంటుంది. కుటుంబ సభ్యులందరూ ఒకచోట కలుసుకొని ఆత్మీయ సమ్మేళనంతో పాటు భక్తిశ్రద్ధలతో ఆ దుర్గాదేవి కొలుస్తారు. 

అలాంటి దసరా పండుగ ఈసారి మరో ప్రత్యేకమైన రోజున రాబోతుందనీ మీకు తెలుసా..? ఇలాంటి అద్భుతమైన ముహూర్తం 30 సంవత్సరాల ముందు వచ్చిందంట. మరల తిరిగి ఇప్పుడు ఆ ముహూర్తంలో దసరా పండుగ వచ్చింది. పండితులు ఈ ముహూర్తం గురించి చాలా విశిష్టంగా చెబుతున్నారు.. ఆశ్వయుజ మాసం, శుక్ల పక్షం, మొదటి రోజు నుండి తొమ్మిది రోజులపాటు నవరాత్రులు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం  అక్టోబర్ 15 నుండి 24 వరకు దసరా నవరాత్రిళ్లు జరుపుకోబోతున్నాము.

చాంద్రమానం ప్రకారం శోభకృత్ నామ సంవత్సరంలో, దుర్గాదేవి ఏనుగుపై భూమిని దర్శించబోతుందని పండితులు చెబుతున్నారు. 30 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ ఆధ్యాత్మిక అరుదైన ముహూర్తంలో దుర్గాదేవిని కొలుచుకునే మొదటి రోజున.. బుధ ఆదిత్య యోగం, షాష రాజ్యయోగం, భద్ర రాజ్యయోగం అనే శుభ యోగాలున్నాయంటున్నారు పండితులు.అలాగే ఈ యోగాల కలయిక వలన చాలా విశిష్టత ఉందని పండితులు చెబుతున్నారు. ఈ నవరాత్రి సమయాల్లో ఇలాంటి రోజు రావడం ఎంతో పవిత్రమైందని, దానివల్ల తగినన్ని వర్షాలు కురుస్తాయని పండితులు వెల్లడించారు.

జ్యోతిషశాస్త్రంలో దీనిని మరోవిదంగా పరిగణిస్తున్నారు. బుధుడిని.. తెలివితేటలు, ప్రసంగం, తర్కం, వ్యాపారం, వాణిజ్యం మరియు ఇతర సంబంధిత విషయాలకు చిహ్నంగా పరిగణిస్తారు. అలాగే రాజులు, తండ్రులు, ప్రభుత్వాలు మరియు ఉన్నత పరిపాలనా స్థానాలకు ఏకకాలంలో సూర్యుడు కూడా కారకంగా బుధ ఆదిత్య యోగంగా పరిగణిస్తారు. 

సూర్యుడు దీనికి అదనంగా ఒక వ్యక్తికి శక్తిని మరియు జీవిత శక్తిని కూడా ఇస్తాడు. ఈ రెండు అత్యంత శక్తివంతమైన గ్రహాలు కావడం విశేషం. అక్టోబర్ 15వ తేదీన బుధుడు మరియు సూర్యుడు ఒకే ఇంటిలోకి వస్తారని దానివల్ల బుధ ఆదిత్య యోగం సంభవిస్తుందని.. కాబట్టి.. ఇలాంటి అరుదైన నేపధ్యంలో గ్రహాలు కలిసి వచ్చినప్పుడు, స్థానికుల జీవితాలు, వాణిజ్యపరమైన లేదా విద్యాపరమైన పురోగతికి సంబంధించి అనుకూలమైన ఫలితాలు వస్తాయని వారు తెలుపుతున్నారు. 

శని గ్రహం అక్టోబర్ 15 వ తేదీన కుంభరాశిలో తిరోగమనం చేసి 180 రోజులు అదే రాశిలో ఉండటం… శనితో పాటు మరో రెండు గ్రహాలు 6 నెలల పాటు కుంభరాశిలోనే ఉండడాం ద్వారా… ఈ మూడు గ్రహాలు తిరోగమనం వలన కేతు షాష రాజ్యయోగం ఫలితాలు భక్తులకు దక్కుతాయని నిపుణులు చెబుతున్నారు. 

ఇప్పుడు మనం మరోయోగం గురించి ప్రస్తావిద్దాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యోగం మనకు ఎలాంటి శుభ పరిణామాలను తీసుకొచ్చి పెడుతుందో తెలుసుకుందాం.. అయితే ఇది వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం చెప్పే యోగం.. పంచ మహా పురుష యోగాకు జాతక కుండలిలో చాలా ప్రాముఖ్యత ఉంది. జాతకంలో బుధుడు, కుజుడు, గురు, శుక్రుడు, శని గ్రహాలు బలమైన స్థానంలో ఉన్న సమయంలో కొన్ని యోగాలు ఏర్పడతాయి. 

ఈ పంచ మహాపురుష యోగాలు ద్వారా.. బృహస్పతితో హంస యోగం, బుధునితో భద్ర యోగం, శుక్రుడుతో మాలవ్య యోగం, కుజుడు ద్వారా రుచక్ యోగం, శని ద్వారా శాస యోగాలు ఏర్పడనున్నాయి. వీటి అన్నింటి కలయిక వలన అక్టోబర్ 15న భద్ర రాజయోగం ఏర్పడనుంది. ఈ దసరాకు గణేశుడు కూడా మనకు తన ఆశీస్సులను అందించబోతున్నాడు.. 

దసరా పండుగ ఏనుగు తల ప్రతిష్టించుకున్న గణేష్ డితో కూడా సంబంధం కలిగి ఉంది. వినాయకుడు పేరు వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటి..? ఆయన సకల విజ్ఞానాలను తొలగిస్తాడని.. కదా.. అవును.. వినాయకుడు విజ్ఞాలను తొలగించేవాడు. ప్రతి పూజకు ముందు వినాయకుడిని అధినాయకుడిగా పూజిస్తారు. అనే విషయం మనకు తెలిసిందే.. అలా పూజించడం వల్ల జ్ఞానం, ఆనందం, సంపద ,ఆరోగ్యం సమకూరుతాయాని ఆధ్యాత్మికవేత్తలు ఈ పూజకు ఉన్న ప్రతిష్టతను ప్రతి ఒక్క పూజావ్రతంలో తెలియజేస్తూ ఉంటారు. 

అయితే ఈ దేవీ నవరాత్రులలో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టించి, నవరాత్రులు ఘనంగా జరిపేందుకు చాలా మంది భక్తులు శ్రీకారం చుట్టారు. ఇంత విశిష్టత కలిగిన ఈ దసరా పండుగ నాడు దుర్గామాత భూమిపైకి వచ్చే వాహనాన్ని బట్టి పంచాంగ కర్తలు, జ్యోతిష్యులు భవిష్యత్ కాలం ఎలా ఉందో చెప్పబోతున్నారు. దుర్గామాత వాహనం సింహం అయినప్పటికీ అమ్మవారు ప్రతి ఏడూ ఒక వాహనంపై సంచరిస్తూ ఉంటారని జ్యోతిష్యులు వెల్లడిస్తున్నారు.

దింతో పాటు ..దసరా పండుగకు విశిష్టంగా అందరూ మాలలు ధరిస్తారు. ఎంతో నియమ ,నిష్ఠలతో పూజలు చేస్తారు. ఆ దుర్గామాతను కఠిన నియమాలు పాటించి కొలుస్తారు. ముఖ్యంగా ధూమపానం, మద్యపానం, జూదం లాంటివాటికి దూరంగా ఉండి, బ్రహ్మచర్యాన్ని కఠినంగా పాటిస్తారు. నిత్యం బ్రహ్మ ముహూర్తమైన తెల్లవారుజామున 4:30కు అమ్మవారిని ఆరాధిస్తారు.

ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం.. ఈ అద్భుతమైన విశిష్టత కలిగిన ముహూర్తంలో వచ్చేటటువంటి దసరా పండుగను మీరు కూడా భక్తిశ్రద్ధలతో, ఆ దుర్గామాతను కొలిచి మీ కోరికలను నెరవేర్చుకోండి..  ఈ దసరా పండగ మీకు సకల శుభాలను కలగజేయాలని మేము కోరుకుంటున్నాము.

Like Reaction0Like
Like Reaction0Love
Like Reaction0Haha
Like Reaction0Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: 700 Years Old Lord Ganesha StatueDussehraDussehra Festival is SpecialLord BramhaLordShivaTulipFestivalఆధ్యాత్మికం
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.