• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home ఆధ్యాత్మికం

వినాయక నిమజ్జనం వెనుక అసలు రహస్యం మీకు తెలుసా?

TrendAndhra by TrendAndhra
December 26, 2022
in ఆధ్యాత్మికం
277 3
0
lord ganesh nimajjanam
544
SHARES
1.6k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

అసలు వినాయక నిమజ్జనం ఎందుకు చేస్తారు. నిమజ్జనం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి? తెలుసుకుందాం రండి..

వినాయక చవితి పండుగ యావత్తు ప్రకృతి నియమాలపై ఆధారపడి జరుగుతుంది. వాగుల్లో దొరికే ఒండ్రు మట్టితో ఆ స్వామి ప్రతిమను తయారు చేస్తాం పత్రి పేరుతో 21 రకాల ఆకులతో ఆయనని పూజిస్తాం. ఇలా అలంకరించిన స్వామిని ఆయనను పూజించిన పత్రి తో సహా నిమజ్జనం చేస్తాం. సృష్టి స్థితి లయ అనే మూడు దశలు ఈ పూజలో కనిపిస్తాయి. వాటికి విరుద్ధంగా పూజ సాగింది అంటే అందులో ఏదో కృత్రిమత్వం మొదలైంది అని అర్థం.

పూజలో మట్టి విగ్రహం పత్రి ఉపయోగించడం వెనుక కూడ మరొక కారణం ఉంది.ఒండ్రు మట్టి లోను పత్రి లోనూ ఔషధ గుణాలు దాగి ఉంటాయి. గణనాథుడికి చేసే షోడశోపచార పూజలో భాగంగా వీటిని పదే పదే తాకడం వల్ల వాటిలోని ఔషధీ తత్వం మనకు చేరుతుంది. పూజ ముగిసిన తర్వాత ఒక తొమ్మిది రోజులు ఆ విగ్రహాన్ని పత్రిని ఇంటిలో ఉంచుకోవడం వల్ల ఔషధ గుణాలు గాలి ద్వారా ఇల్లు మొత్తం వ్యాపిస్తాయి.. ఆ తర్వాత విగ్రహాన్ని పత్రిని దగ్గరలో ఉన్న చెరువులోనో, నదిలోనో నిమజ్జనం చేస్తాం. ఈ క్రమంలో ఎక్కడ ఎలాంటి శేషము మిగలదు.

అంతేకాక వినాయక చవితి నాటికి వర్షాలు ఊపు అందుకుంటాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతూ ఉంటాయి. అలాంటి సమయంలో తీరం వెంబడి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల వరద పోటు తగ్గే అవకాశం ఉంటుంది. పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయని అంటారు కాబట్టి నీళ్ళలో వదిలే పత్రి వల్ల దానిలో ఉండే ఔషధ గుణాలు నీటిలో కలవడం వల్ల‌ నీరు క్రిమిరహితంగా అవుతుంది.

అంతేకాక వినాయక నిమజ్జనంలో ఒక సామాజిక అంశం కూడా ఉంది. వాడవాడలా వినాయక విగ్రహాలు పెట్టడం వల్ల ఇరుగుపొరుగు కలిసిమెలిసి పండుగ చేసుకొని బంధాలను పెంచుకోవడం జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో భక్తి శృతిమించి పరువు కోసం పాకులాడుతూ ఒకరికి ఒకరు గొప్ప అని చెప్పుకోవడానికి రంగు విగ్రహాలు వాడుతున్నారు.వాటిని నదులు-చెరువుల్లో కలపడం వల్ల నీరు కలుషితమై ప్రకృతికి నష్టం కలుగుతుంది. అంతేకాక ఎక్కువ శబ్దాలు వచ్చే లౌడ్ స్పీకర్లు,డీజే బాక్సులు శబ్ద కాలుష్యానికి కారణం అవుతున్నాయి. మనిషి ప్రకృతిని కొలవడం ప్రకృతి ధర్మాలు పాటించడం మాని ఆడంబరాల కోసం పాకులాడటం వల్ల ప్రకృతి వినాశనానికి కారణమై భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

–వెంకట్

Like Reaction0Like
Like Reaction0Love
Like Reaction0Haha
Like Reaction0Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: Devotional Latest News in TeluguDevotional NewsDevotional News in TeluguDevotional News TeluguGanesh Chaturthi 2023Ganesh Chaturthi HistoryGaneshaHistory of Ganesh ChaturthiLatest Bhakthi NewsLatest News on GodLatest News on Lord KrishnaLatest News on Lord ShivaLatest News on Lord VishnuLatest Telugu Spirituality NewsTelugu Devotional NewsThe Legend and History of Ganesh ChaturthiToday Devotional News in TeluguTrend AndhraTrend Andhra Devotional NewsTrend Andhra NewsTrendandhra Latest Devotional NewsWhat is Ganesh Chaturthi?What is Ganesh Chaturthi? Why is it celebrated?What is the story behind the tradition of Ganesh visarjanWhy is Ganesha idol immersed in Waterఆధ్యాత్మికంభక్తి
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.