Lakshmi Devi : ఎంత కష్టపడినా కూడా సంపదను జీవితంలో నిలబెట్టుకోలేరు. సంపాదించేటప్పుడు ఆర్థిక సమస్యలు తలెట్టడం లాంటివి కొందరి జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులలో లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలంటే చేయవలసిన ఐదు పనులను తెలుసుకుందాం.
ధర్మం కోసం మన సంపాదించిన కొంత డబ్బును వెచ్చించాలి. మంచి పనుల కోసం సంపదలో కొంత బాగాన్నీ వాడడం మనకు శ్రేయస్కరం. చేసిన దానధర్మాలను ప్రచారం చేసుకోకపోవడమే ఉత్తమం. ఈ చేత్తో చేసిన దానాన్ని ఆ చేత్తో మర్చిపోవాలి అంటారు పెద్దలు. వాస్తవానికి అలా చేస్తేనే దానధర్మాల పుణ్యఫలం మనకు దక్కుతుంది.
మన సంపదలో కొంత భాగాన్ని ఆలయాల కోసం, పేద ప్రజల కోసం, అనాధల కోసం ఖర్చు చేయడం మంచిది. రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఆలోచించి ఆర్థిక ప్రయోజనం చేకూరేల ఖర్చు చేయాలి. మిగిలిన డబ్బులో కొంత మొత్తాన్ని వారి,వారి వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేస్తూ, కుటుంబం, పిల్లల కోసం మిగతాది ఖర్చు చేయాలి.
మన సంపాదన ఈ రకంగా ఖర్చు చేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మన పైన ఉంటుంది. ఎప్పుడైనా సరే సంపదను వృధా కానివ్వకూడదు. సంపదకు విలువ ఇచ్చి చూడాలి. విలువ లేని చోట ఆ లక్ష్మీదేవి కటాక్షం మనకు దక్కదు. బంగారం, లోహంతో తయారు చేయబడిన వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల కూడా మనకు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి.
పడమటి దిశలో వాటర్ ట్యాంక్ ను ఉంచితే మనపై ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. ఈ విధంగా చేయడం ద్వారా మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందే అవకాశాలు ఎక్కువ.