lt is the Largest Temple in the World : భారతదేశంలో చాలా ప్రసిద్ధమైన ఆలయాలు ఉన్నాయి. అలాగే చిన్న, చిన్న ఆలయాలు లెక్కలేనన్ని మనకు కనిపిస్తూనే ఉంటాయి. అయితే అందరికీ తెలియని విషయం ఏమిటంటే, భారతదేశం పెద్ద ఆలయాలను కూడా కలిగి ఉంది అనుకుంటారు, వాస్తవానికి ప్రపంచంలో మొత్తంగా ఉన్న ఆలయాలలో అతిపెద్ద ఆలయం భారతదేశంలో లేదు. ఈ అతి పెద్ద ఆలయంగా ప్రసిద్ధికెక్కిన దేవాలయం కంబోడియాలో ఉంది. ఇది ఆంగ్కోర్ వాట్ అనే హిందూ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది.
ఈ ఆలయంలో శ్రీమహావిష్ణుమూర్తికి కొలువై ఉన్నాడు. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి భారీ సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఈ చుట్టూ ఉండే వాతావరణం చాలా ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా చాలా మనోహరమైన, ఆహ్లాదకరమైన, అనుభూతిని కలిగిస్తుంది. ఆ ప్రదేశాలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఈ ఆలయం పై కంబోడియా జాతీయ జెండా ఉంటుంది.
అయితే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఈ ఆలయం నమోదయింది. యశోదాపూర్ అని కూడా ఈ ఆలయాన్ని పిలుస్తారు. ఈ ఆలయం మొత్తంగా 402 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి లక్షల ఇసుకరాళ్లాను ఉపయోగించారని చరిత్ర చెబుతుంది. ఒక రాయి బరువు ఒకటిన్నర టన్ను ఉంటుందని చరిత్రకారులు చెప్పారు.
అయితే ముఖ్యంగా ఆలయ చరిత్ర చూసుకుంటే ఈ ఆలయం చక్రవర్తి సూర్యవర్మన్ ll హయాంలో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని ఆ చక్రవర్తి విష్ణుమూర్తికి అంకితం ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని 1992లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. ఇంకా ముఖ్యంగా ఆలయ గోడల పైన రామాయణం, మహాభారతం దృశ్యాలు మనకు కనిపిస్తాయి. రామాయణం, మహాభారత సమయంలో దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మదన దృశ్యాలు కూడా ఈ ఆలయం గోడల మీద మనకు కనిపిస్తాయి. అదేవిధంగా ఈ ఆలయ శిల్పకళా సంపద, కళా నైపుణ్యం చూపరులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా, ఈ ఆలయ నిర్మాణ సౌందర్యం ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. సుదూర ప్రాంతాల నుండి వచ్చేవారు ఈ ఆలయ రూపకల్పనను చూసే మంత్రముగ్ధులు అవుతారు.