Mount Kailasa : కైలాస పర్వతం ఈ పేరు మీరు వినే ఉంటారు. ఆ శివుని యొక్క నిలయమని చాలామంది విశ్వసిస్తారు. కైలాస పర్వతం మీద శివుడు కొలువై ఉన్నాడనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. కైలాస పర్వతం మన పక్క దేశంలోని టిబెట్ లో ఉంది. ఇది భారత్, చైనా వరకు విస్తరించి ఉంది. కైలాస పర్వతం ఎత్తు 6,638 మీటర్లు. అతి పెద్ద పర్వతమైన ఎవరెస్టు పర్వతం 8,848 మీటర్ల ఎత్తు కలిగి ఉంది.
ఎవరెస్ట్ కంటే కైలాస పర్వతం ఎత్తు 2000 మీటర్లు తక్కువ. ఇప్పటివరకు మౌంట్ ఎవరెస్టును చాలామంది పర్వతారోహకులు ఎక్కారు. అలా ఎక్కే ముందు వారితో ఆక్సిజన్ తీసుకొని వెళ్తారు. ఎందుకంటే శిఖరాన్ని చేరుకోగానే ఆక్సిజన్ లెవెల్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి వారు ఆక్సిజన్ ని కృత్రిమంగా పట్టుకొని వెళ్తారు. కానీ అదే కైలాస పర్వతం మీదికి ఆక్సిజన్ తీసుకొని వెళితే అది ఏమాత్రం పని చేయదు.
పర్వతాన్ని ఎక్కుతున్న కొద్దీ మనుషులలో చాలా మార్పులు సంభవిస్తాయి. అక్కడ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. వారికి ఆక్సిజన్ ఉన్నా కూడా అది అందదు. ఇప్పటివరకు కైలాస పర్వతాన్ని చాలామంది అధిరోహించాలని చూశారు కానీ అది ఎవరి తరం కాలేదు. ప్రాణాలు కూడా కోల్పోయారు. కైలాస పర్వతం మీద సాక్షాత్తు ఆ శివుడే కొలువై ఉన్నాడని కొన్ని ఆధారాలను బట్టి చెప్పవచ్చు.
హిందూ ధర్మ శాస్త్రంలో ఈ ప్రస్తావన కూడా ఉంది. చాలామంది కైలాస పర్వతాన్ని అధిరోహించాలని చూసిన సాధ్యం కాలేదు అంటే ఖచ్చితంగా ఆ శివుడు అక్కడ కొలువై ఉన్నాడని చెప్పవచ్చు. ఆ పర్వతం కూడా లింగాకారాన్ని పోలి ఉంటుంది. అక్కడికి మనుషులు ఎక్కాలి అని అంటే వాతావరణం అకస్మాత్తుగా మారిపోయి, చలి తీవ్రత పెరిగి, గుండె వేగంగా కొట్టుకొని మరణిస్తారు.