Numerology : పుట్టినరోజు తేదీని ఆధారంగా చేసుకొని సంఖ్యా శాస్త్ర ప్రకారం ఆ వ్యక్తి యొక్క గుణాలను, వారి ప్రవర్తనను అంచనా వేయవచ్చు. దానినే న్యూమరాలజీ అని అంటారు. ఇటువంటి న్యూమరాలజీలో అత్యంత శక్తివంతమైన సంఖ్యలు కూడా ఉన్నాయి. వాటి వల్ల ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఇట్టే చెప్పొచ్చు అంటున్నారు నిపుణులు. ఆ సంఖ్యలు ఏమిటి.. వాటి వల్ల ఉపయోగం ఏమిటి.. తెలుసుకుందాం.
న్యూమరాలజీలో ముఖ్యంగా 11, 22, 33 సంఖ్యలను మాస్టర్ అంకెలుగా పరిగణనలోకి తీసుకుంటారు. వీటిని ఇతర సంఖ్యల కంటే శక్తివంతమైనవిగా నిపుణులు అభిప్రాయపడతారు. ఎందుకంటే ఇవి మనిషి యొక్క తెలివిని, అవగాహనను సూచిస్తాయని వారు తెలుపుతున్నారు. ఈ సంఖ్యలకు ఒకే అంకెను రెడ్యూస్ చేయరు. అందుకే ఇవి రెండు అంకెల రూపంలో ఉండి మరింత శక్తివంతమైనవని న్యూమరాలజీ చెబుతుంది.
11, 22, 33 అంకెల్లో 33 ప్రత్యేకమైన స్థానం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెంబర్ కరుణ, వైద్యం, సేవను సూచించే సంఖ్య అని న్యూమరాలజీ చెబుతుంది. న్యూమరాలజీ ప్రకారం 33 నెంబర్ ఉన్న వ్యక్తులు చాలా దయ కలిగి ఉంటారని సంఖ్యాశాస్త్రం వెల్లడిస్తుంది. ఈ సంఖ్య కలిగిన వ్యక్తులు ఎక్కువగా వైద్య వృత్తిని ఎన్నుకుంటూ ఉంటారు.
అలాగే 22 సంఖ్య కలిగిన వారు ప్రపంచాన్ని మంచి స్థానంగా మార్చడానికి అంకితమైన టీచర్లుగా కావడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారంట. 22 సంఖ్య అనేది మంచి సుగుణాలకు, శక్తికి, పాండిత్యానికి మాస్టర్ సంఖ్య అని న్యూమరాలజిస్టులు చెబుతున్నారు. 22 అంకె కలిగిన వారు సహజ సిద్ధంగా ఎదిగే లీడర్స్ లాగా ఉంటారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఎటువంటి లక్ష్యాన్ని అయినా కూడా వీరు అందుకోగలుగుతారు.
అలాగే 11 నెంబర్ సంఖ్య కలిగిన వారు సహజంగా ఆధ్యాత్మికంగా ఉంటారు. వీరికి ముందుచూపు ఎక్కువగా ఉంటుంది. మంచి నాయకులుగా గుర్తింపు తెచ్చుకుంటారు. న్యూమరాలజీ ప్రకారం ఇతర సంఖ్యల కంటే ఈ మూడు సంఖ్యలు కలిగి ఉన్న వ్యక్తులకు మంచి గుర్తింపు ఉంటుంది.