Numerology : నెంబర్స్ వైబ్రేషన్ ,ఎనర్జీ ద్వారా ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు, జీవితం మరియు వ్యక్తిత్వం గురించి న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం చెబుతుంది. అందరికీ తమ భవిష్యత్తు ఎలా ఉంది. ఏం జరుగుతుంది. అనీ తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. దానికోసం న్యూమరాలజీని ఆశ్రయిస్తారు. అయితే కొందరి సంఖ్యల కలయిక ప్రకారం ఆ వ్యక్తి యొక్క స్థితిగతులు అంచనా వేస్తుంటారు.
3 ,7 నెంబర్ల తేదీలో పుట్టిన వారి జీవితానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు చూద్దాం. న్యూమరాలజీ ఓ వ్యక్తి జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో చెప్పడంలో సహాయపడుతుంది. నంబర్ల ద్వారా క్రియేట్ చేసినా చార్ట్‌కు అనుగుణంగా అనుసరించే మార్గాన్ని న్యూమరాలజీ అందిస్తుంది. దీనికోసం డెస్టినీ, సైకిక్ నంబర్ కాలిక్యులేషన్ నీ ఉపయోగిస్తారు.
ఆయా తేదీలలో జన్మించిన వ్యక్తులు తమ జీవితంలో న్యూమరాలజీ ద్వారా సరైన సూచనలు తీసుకోవచ్చు.న్యూమరాలజీలో 3 అంకె ఒక్క ప్రభావం చాలా ముఖ్యమైనది. ఈ నంబర్ క్రియేటివిటీ, కమ్యూనికేషన్, సెల్ఫ్-ఎక్స్ప్రెషన్తో కలగలిపి ఉంటుంది. వివిధ రంగాలలో విజయం పొందడానికి ఈ నంబర్ ఉపయోగపడుతుంది. తమ చార్ట్‌లో నంబర్ 3 ఉన్న వ్యక్తులు చాలా ఎక్స్‌ప్రెసివ్, క్రియేటివీటి కలిగి ఉంటారు.
తమ ఆలోచనలను స్పష్టంగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. నేచురల్ ఎబిలిటీని పొంది చాలా ఆకర్షణీయంగా ఉంటారు. కెరీర్ కు సంభందించి, రిలేషన్స్ మరియు పర్సనల్ డెవలప్మెంట్ లాంటి అంశాలలో నిర్ణయాలు తీసుకోవడంలో 3 అంకె ఉపయోగపడుతుంది. న్యూమరాలజీలో 7 మరో ముఖ్యమైన అంకె. ఈ అంకె ఆధ్యాత్మికత, అంతర్ దృష్టి, జ్ఞానంతో మమేకమై ఉంటుంది.
చార్టులో 7వ నంబర్ కలిగి ఉన్న వ్యక్తులు చాలా సహజంగా ఉండి, వారి చుట్టూ ఉన్న ప్రపంచం గురించి లోతైన అవగాహన కలిగి ఉండటంతో పాటు,అంతర్గత వ్యక్తులతో బలమైన సంబంధాన్ని కూడా కలిగి ఉంటారు.. స్పిరిచ్యువాలిటీ, సెల్ఫ్-డిస్కవరీ లాంటి అంశాలలో నిర్ణయాలు తీసుకోవడంలో 7వ అంకె ప్రభావం ఎక్కువగా ఉంటుంది.3,7 అంకెల కలయికతో ఉన్నవారు ప్రపంచాన్ని జయిస్తారు.
ఈ నంబర్లు అధికంగా ఉంటే మాత్రం ప్రతికూల ప్రభావాలు, హానికరమైన ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని పద్ధతులు అవలంబించడం వల్ల ఈ కలయిక నుంచి ఉత్తమ మార్గాన్ని పొందవచ్చు. చందనం మనసును ప్రశాంతంగా చేయడానికి మంచి ప్రభావాన్ని కలిగించడానికి దోహదపడుతుంది. నుదటిపై చందనం ధరించడం శ్రేయస్కరం.
సాయంత్రం సమయంలో తులసి మొక్కకు దీపం వెలిగించి, పూజ చేస్తే అనుకూలమైన వాతావరణం ఏర్పడి శాంతి కలుగుతుంది.