Phoenix Bird : మన భారతదేశంలో ఆచార, సాంప్రప్రదాయల ప్రకారం వాస్తుకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మనందరికీ తెలుసు. వాస్తు ఖచ్చితంగా పాటిస్తూ ఇల్లు నిర్మాణం చేస్తూ ఉంటాము. అయినప్పటికీ కొన్ని విషయాలు మనల్ని డైలమాలో పడేస్తాయి. అలాంటిదే ఫినిక్స్ బొమ్మను ఇంట్లో పెట్టుకోవాలా.. లేదా.. అనే అంశము. ఈ బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే శుభమా… అశుభమా.. ఇప్పుడు తెలుసుకుందాం. ఫినిక్స్ పక్షి ఉందో లేదో ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ..
వాస్తుశాస్త్రంలో మాత్రం ఈ బొమ్మకు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. అలాంటి ఈ బొమ్మను ఇంట్లో పెట్టుకోవాలని అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే వాస్తుశాస్త్రంలో మాత్రం ఈ బొమ్మకు మంచి గిరాకీ ఉందని చెప్పవచ్చు. ఈ పక్షి బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే శుభప్రదం అని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే విజయానికి సంకేతంగా ఫినిక్స్ పక్షిని ప్రతిరూపంగా వాళ్లు చెబుతున్నారు. అందుకే వాస్తుశాస్త్రంలో కూడా ఈ పక్షికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఈ పక్షి ఉందో,లేదో అని చాలామందికి సందేహంగా ఉంటుంది. అయితే గ్రీకు పురాణంలో దీన్ని పునర్జన్మకు ప్రత్యేకగా చెప్పేవారు. వారి పూర్వీకుల బూడిద నుంచి తిరిగి జీవం పోసుకున్న పక్షిగా దీనిని వారు భావించేవారు. క్రిస్టియానిటీ తొలి రోజుల్లో కూడా ఈ పక్షి చిహ్నాన్ని మత చిహ్నంగా వారు భావించేవారు. ఈ పక్షి విగ్రహాన్ని దక్షిణ దిశలో ఉంచితే మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం నిపుణులు చెప్తున్నారు. ఈ పక్షిని మాయాపక్షి లేదా అమర పక్షి అని కూడా పిలుస్తూ ఉంటారు.
దీనివల్ల సకల లాభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఫినిక్స్ పక్షి ఇంట్లో ఉంచుకుంటే లాభాలు కలిగినట్లే.. నష్టాలు కలిగించే కొన్ని పక్షుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా గబ్బిలం, కాకి, రాబందు, గుడ్లగూబ వంటి పక్షుల విగ్రహాలు ఇంట్లో అలంకరించుకోవడం వల్ల నష్టాలు వస్తాయని శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.