Shani Dev Puja : దేవతలలో శనీశ్వరుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శనివారం ఆ శనీశ్వరుడికి అంకితం. శనిదేవుడి ఆగ్రహానికి గురైతే మాత్రం జీవితంలో చాలా కష్టాలు, నష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. మనిషి చేసే పనులను బట్టి వారి కర్మలు నిర్ణయించబడతాయి. వారి కర్మను బట్టి శనీశ్వరుడి ఫలాలు నిశ్చయించబడతాయి.
ఒక వ్యక్తికి చెడు కోణం ఉన్నట్లయితే అటువంటి వ్యక్తి తన జీవితంలో వ్యాపారం, డబ్బు కు సంబంధించిన ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శని పడితే అంత సులభంగా పోదు అంటారు పెద్దలు. ఏలినాటి శని అని కూడా అంటుంటారు. మరి అలాంటి శని దేవుడి ప్రభావం మన మీద పడితే ఎలాంటి క్రియలు చేసి దాని నుండి విముక్తి పొందాలి.
శనిదేవున్నీ ప్రసన్నం చేసుకోవాలంటే మార్గాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్కరి ఇంట్లో దీపం వెలిగిస్తూ ఉంటారు. ఆ దీపంలో లవంగాలు వేయడం ఉత్తమం. ఆ శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూజ సమయంలో దీపం వెలిగించినప్పుడు ఆవనూనెతో దీపం వెలిగిస్తే మంచిది.
ఆవనూనెతో వెలిగించిన దీపంలో లవంగాలను పెట్టడం వల్ల మీ అదృష్టం మారుతుంది. డబ్బు మీదరి చేరుతుంది. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా బలంగా వృద్ధి చెందుతాయి. ఇలా ప్రతినిత్యం చేయడం వల్ల డబ్బుకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. అలాగే శనివారం సాయంత్రం క్రమం తప్పకుండా ఆవాల నూనెతో దీపం వెలిగించడం ద్వారా శని దేవుడు ప్రసన్నమవుతాడు.
శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలు మనం పాటిస్తే మంచిది అవేంటంటే.. కర్పూరం ప్రతి ఇంట్లో పూజలో వాడుతూ ఉంటారు. అది హిందూ మతం యొక్క సాంప్రదాయం. ఈ కర్పూరాన్ని క్రమం తప్పకుండా ఇంట్లో కాల్చినట్లయితే ఇంటిలోని ప్రతికూల శక్తులు వైదొలుగుతాయి. కర్పూరం వెలిగించేటప్పుడు కర్పూరం స్వచ్ఛంగా ఉండాలి. ఈ కర్పూరం వల్ల క్రిమి కీటకాలు కూడా ఇంట్లోకి ప్రవేశించవు.
హిందూశాస్త్రం ప్రకారం దానధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మీరు క్రమం తప్పకుండా దానం చేస్తే ఎన్నో ప్రయోజనాలు పొంది, మీకు పుణ్యఫలం లభించడమే కాక సుఖసంతోషాలతో మీ కుటుంబం వర్ధిల్లుతుంది. పక్షులకు ఆహారం పెట్టడం వల్ల మీ జీవితంలో పురోగతిని సాధించవచ్చు. అలాగే రోటీని కుక్కలకు తినిపించడం వల్ల కూడా పుణ్యం లభిస్తుంది. ఇలాంటి శాస్త్రపరంగా ఉన్న నియమాలను పాటిస్తే ఎటువంటి శని మీ దరిదాపుల్లోకి రాదు.