Sreekaram : మనం శుభకార్యం మొదలుపెట్టాలి అనుకున్నప్పుడు, ఏదైనా రాసేటప్పుడు, లేకపోతే ఏవైనా కొత్త వస్తువులు కొన్నప్పుడు, శ్రీకారం అని రాసి ఆ తర్వాత కార్యాన్ని మొదలుపెడతాం. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు ఆ పనికి శ్రీకారం చుట్టారు అని పెద్దలు అంటుంటారు. ఆ అక్షరానికి హిందూ ఆచారా,సాంప్రదాయాలలో అంత ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటి అక్షరాన్ని ఎందుకు రాస్తాము.. శ్రీకారంతో ఎందుకు పనులను మొదలు పెడతాము… దానివల్ల మనకు కలిగే శుభాలు ఏంటి.. తెలుసుకుందాం.
మన హిందూ సాంప్రదాయంలో, ఆచార సాంప్రదాయాలలో శ్రీకారానికి మొదటి పీఠ వేస్తారు. శ్రీ అంటే బీజాక్షరం.శ్రీ అంటే మంగళకరమైనది. మోక్షానికి సూచిక. శ్రీకారంతో మొదలుపెట్టిన కార్యం ఏటువంటి కారణం చేత కూడా ఆగిపోదు. దానివల్ల శుభాలు కలుగుతాయి తప్ప అశుభాలు జరగవు. ఎందుకంటే…
శ్రీ అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ప్రధమైనది. శ్రీకారంతో ప్రారంభించే ఏ కార్యమైనా దిగ్విజయం పొందుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీకారంతో క్షేమం కలుగుతుంది అని శాస్త్రాలలో నిక్షిప్తమై ఉంది. శ్రీ అనే శబ్దానికి శాంతి ,శోభ అనేటటువంటి అర్ధలు కూడా ఉన్నాయి. ఈ విశ్వంలో అంతిమము, అనాదికి శ్రీ నే మార్గదర్శకం. దాని గురించి తెలుసుకునే విద్యను శ్రీవిద్య అని పిలుస్తారు. శ్రీవిద్య అనగా ఆ అమ్మవారి యొక్క ఉపాసకులు అని అర్థము.
సాక్షాత్తు ఆ త్రిమూర్తులకు ఆశ్రయమిచ్చే శక్తిని శ్రీ అని పిలుస్తారు. ఆ శ్రీ అనే పదానికి అంతటి ఘనస్థానం ఉంది. అందుకే మనం గమనించినట్లయితే ఏదైనా శుభకార్యం మొదలుపెట్టేముందు ఖచ్చితంగా శ్రీకారంతోనే మొదలుపెడతారు. దానివల్ల ఆ కార్యం విజయంతో ముగుస్తుంది. ఆ త్రిమూర్తుల అనుగ్రహం ఆ కార్యంపై ఉంటుంది. శ్రీ ని గౌరవప్రదంగా పిలవడానికి ఉపయోగిస్తాం.