Strange Temple in Uttarakhand : భారతదేశం ఎన్నో ఆలయాలను కలిగి ఉంది. ఒక ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే కొన్ని ఆలయాలలో అంత చిక్కని రహస్యాలు కూడా ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఒక ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం మన భారతదేశంలోని ఉత్తరాఖండ్ లో చమోలి జిల్లాలో గల, దేవల్ బ్లాక్ అనే అడవిలో లాతు అనే మందిరంలో ఇప్పుడు చాలా వింతైన ఆచారాలను ఇప్పటికీ పాటిస్తున్నారు.
అంతేకాకుండా ఇక్కడ వింతైన రహస్యాలు కూడా ఎన్నో దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తుల కళ్ళకి గంతలు కడతారు. అక్కడి పూజారులు అలాగే నోటికి, కళ్ళకు కచ్చితంగా గంతలు కట్టుకుంటారు. కళ్ళకు గంతలతో ఆలయంలోకి ప్రవేశించి ఆ దేవతను దర్శనం చేసుకోవాలంట.
ఉత్తరాఖండ్ లోని నందదేవి మతపరమైన సోదరిలాగా లాతుదేవతను పరిగణిస్తారు అని అక్కడ స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంత ప్రజలు ఈ దేవతను చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఖచ్చితంగా గంతలు ఎందుకు కట్టుకోవాలంటే నాగరాజు తన విలువైన రత్నాన్ని ధరించి లాతు దేవాలయంలో దర్శనం ఇస్తాడని భక్తులు చెబుతున్నారు.
ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు నేరుగా ప్రకాశిస్తున్న మణిని చూస్తే గుడ్డివారు అవుతారని, అక్కడి పండితులు చెప్పడం విశేషం. అక్కడి భక్తులు అనాది కాలం నుండి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. దేవాలయం రోజు తెరవరు కేవలం వైశాఖ పౌర్ణమి రోజు మాత్రమే తెరుస్తారంట. ఆలయం తెరిసిన రోజు భక్తులు ప్రవేశం చేసి దూరంనుండే, దైవదర్శనం చేసుకోవడం జరుగుతుంది.