Temple : చాలా మందికి గుడికి వెళ్లే అలవాటు ఉంటుంది. వారంలో ఒక్కసారైనా లేక, ప్రతిరోజైనా కూడా గుడికి వెళ్లి దర్శనం చేసుకుంటూ ఉంటారు. దానివల్ల వారి జీవితంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి, ప్రశాంతత చేకూరుతుందని నమ్మకం. అయితే గుడికి వెళ్లే సమయంలో చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మాంసాహారం తిన్న తర్వాత దేవాలయానికి అసలు వెళ్ళకూడదు. అలాగే ఆలయం ప్రాంగణంలోకి చెప్పులు వేసుకొని వెళ్లకూడదు. దేవుడిని పూజించే సమయంలో వస్త్రధారణ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. దేవుని ప్రార్థించే సమయంలో ఇక ఏ ఇతర విషయాల గురించి కూడా ఆలోచించకూడదు.
వాటితోపాటు ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత దేవుడిని ఎలా ప్రార్థించాలో కూడా తెలుసుకోవాలి. ఆలయానికి వెళ్లే ముందు విగ్రహాలను తాకడం అసలు శ్రేయస్కరం కాదు. విగ్రహాలను తాకడం వల్ల పవిత్రత దెబ్బతింటుంది. మన మనసు ఒక భగవంతునిపైనే లగ్నం చేసి, మానసికంగా దృఢంగా, ప్రశాంతంగా ఉండాలి. అలా అయితేనే మనకు ప్రశాంతత చేకూరుతుంది.
వీటితోపాటు ఆలయంలో ఉన్న సమయంలో ఎవరి పైన కోపాన్ని చూపెట్టకూడదు. ఆలయంలో ఉన్నంతసేపు దేవుడిపైనే మనసు లగ్నం చేసి భక్తితో ఆ దేవుని ప్రార్థిస్తూ కూర్చోవాలి తప్ప, ఫోన్లను వాడడం ఇంకా వేరే విషయాల గురించి ఆలోచించడంలాంటిది చేయకూడదు.