Vasthu Tips : ఇంట్లో వాస్తు సరిగా లేకపోతే ఆ ప్రభావం ఖచ్చితంగా ఇంట్లో నివసించే వారి పైన పడుతుంది. పండితులు చెబుతున్న దాని ప్రకారం ఇల్లు నిర్మాణం చేపట్టే ముందే వాస్తుని పక్కాగా పాటిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు. కానీ మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటాము.
మరి అటువంటి వాస్తు దోషాలను పోగొట్టుకోవాలంటే చిన్న ,చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. తాబేలు మన ఇంటికి ఎన్నో లాభాలను తీసుకువస్తుంది. అయితే ఈ తాబేలు ఎలా ,ఏదిక్కున ,ఏ ప్రతిమలో పెట్టాలో ఇప్పుడు చూద్దాం.
విష్ణు అవతారాల్లో కూర్మావతారం కూడా ఒకటి. కూర్మము అంటే తాబేలు అని అర్థం. ఈ తాబేలు బొమ్మతో మన ఇంట్లో ఉన్న దోషాలను పోగొట్టుకొని చక్కని ఫలితాలను మనం పొందవచ్చు. విష్ణుమూర్తి తోడు లక్ష్మీ దేవి, విష్ణుమూర్తి ఎక్కడైతే కొలువై ఉంటాడో ఖచ్చితంగా అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీ అంటే సిరిసంపదలు.
కూర్మావతారంలోని విష్ణుమూర్తి ప్రతిమను మన ఇంట్లో ప్రతిష్టించుకుంటే లక్ష్మీదేవి కూడా మనతో ఉన్నట్టే. మార్కెట్లో మనకు చాలా రకాల తాబేలు బొమ్మలు అందుబాటులో ఉన్నాయి. మెటల్స్ తో, చెక్కతో,గాజుతో చేసినవి కూడా దొరుకుతున్నాయి.తాబేలు దీర్ఘాయుష్షు కు సూచిక. 125 నుంచి 150 సంవత్సరాల పాటు జీవిస్తుంది. ఇది ఇంటిలోకి ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును తెస్తుంది.
ఇత్తడి : నైరుతి దిక్కులో ఇత్తడితో చేసిన తాబేలును ప్రతిష్టిస్తే ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి.
చెక్క: చెక్కతో చేసిన తాబేలును తూర్పు దిక్కున పెడితే మనకు మానసిక ఆరోగ్యం,అదృష్టం కలుగుతుంది.
మెటల్/వెండి : వెండితో చేసిన తాబెలు బొమ్మను వాయవ్యం లేదా ఉత్తరంలో ప్రతిష్టించుకోవడం మంచిది.
క్వార్ట్స్ లేదా క్లియర్ గ్లాస్ : ఈ తాబేలును ఆగ్నేయంలో పెడితే ఇంట్లో ప్రతికూల శక్తి తగ్గు ముఖం పడుతుంది.